National: తాళీ, బొట్టు ఉంటేనే భర్తలకు మూడొస్తుంది.. ఆ కేసులో జడ్జీ సంచలన కామెంట్స్!

గృహహింస కేసులో పుణె సెషన్స్ కోర్టు జడ్జి సంచలన కామెంట్స్ చేశారు. కుటుంబ కలహాలపై వివాహిత కోర్టును ఆశ్రయించగా మెడలో తాళి, నుదుటిపై బొట్టు లేకుండా భర్తలను ఎలా ఆకర్షిస్తారని ప్రశ్నించారు. సున్నితమై అంశాలను సామరస్యంగానే పరిష్కరించుకోవాలన్నారు.

New Update
pune court

Pune Sessions Court judge sensational comments domestic violence case

National: ఓ గృహహింస కేసులో మహారాష్ట్ర పుణె జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన కామెంట్స్ చేశారు. కుటుంబ కలహాలపై వివాహిత కోర్టును ఆశ్రయించగా మెడలో తాళి, నుదుటిపై బొట్టు లేకుండా భర్తలను ఎలా ఆకర్షిస్తారని ప్రశ్నించారు. కొన్ని సున్నితమై అంశాలను సామరస్యంగానే పరిష్కరించుకోవాలని సూచించారు.  

 భర్తకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది..

ఈ మేరకు భర్త తనను గృహహింసకు గురి చేస్తున్నాడంటూ ఓ వివాహిత ఇటీవల కోర్టును ఆశ్రయించింది. దీంతో భార్యాభర్తలను పుణె డిస్ట్రిక్ట్  కోర్టు విచారణకు పిలిచింది. వీరిద్దరి ఇష్యూలో న్యాయమూర్తి మధ్యవర్తిత్వం వహించారు. అయితే విచారణ సమయంలో ఆ వివాహితకు మెడలో మంగళసూత్రం లేదు. నుదుటిపై బొట్టు పెట్టుకోలేదు. దీంతో ఆమె వేషాధారణపై కామెంట్స్ చేసిన జడ్జీ.. హిందూ సంప్రదాయం ప్రకారం అలంకరణ లేకుంటే మీపై భర్తకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందని, అతను నీపై ఎలా ప్రేమ చూపిస్తారంటూ ప్రశ్నించడం సంచలనం రేపింది.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

అంతేకాదు మహిళ తన కన్నా ఎక్కువ సంపాదించే పురుషుడినే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తక్కువ సంపాదించే మగాడితో బతకాలని అస్సలే కోరుకోదు. కానీ మగాడి విషయంలో అలా జరగదు. బాగా సంపాదించే మగాడు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంట్లో పనిమనిషిని కూడా పెళ్లి చేసుకుంటాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ కేసును సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

చివరగా మహిళలు, భార్యలపట్ల మగాళ్లు ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉన్నారో గమనించండి. మీరు కూడా అలాగే ఉండాలి. మొండిగా, కఠినంగా వ్యవహరించకూడదని చెప్పారు. ఇక ఈ కేసుకు సంబంధించిన వీడియోను ఆ క్లైంట్ లాయర్ అంకుర్  జహగిర్దార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. జడ్జి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు