Operation Sindoor: పాక్‌ను తిడుతూ యువతి పోస్టు.. అరెస్టు చేసిన పోలీసులు

ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ పూణెకు చెందిన షర్మిస్తా పనోలి అనే లా స్టూడెంట్‌ ఎక్స్‌లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఒక మతాన్ని టార్గెట్‌ చేసాలా కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై పోలీసు కేసు నమోదు కాగా ఆమెను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.

New Update
Pune law student arrested in Gurugram for offensive Operation Sindoor-linked remarks

Pune law student arrested in Gurugram for offensive Operation Sindoor-linked remarks

ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పూణెకు చెందిన షర్మిస్తా పనోలి అనే లా స్టూడెంట్‌ను కోల్‌కత్తా పోలీసులు అరెస్టు చేశారు. గురుగ్రామ్‌లో ఉంటున్న ఈమె.. ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. షర్మిస్తా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులు డిలీట్‌ చేశారు. ఒక మతాన్ని టార్గెట్‌ చేసేలా ఆమె ఎక్స్‌ వేదికగా వీడియో అప్‌లోడ్ చేయగా అది వైరల్ అయ్యింది. 

Also Read: జాబ్ మానేసిన వ్యక్తిని చితక్కొట్టిన అమ్మాయిలు.. ఎందుకో తెలుసా..?

Pune Law Student Arrested In Gurugram

ఈ క్రమంలోనే కోల్‌కత్తా పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత ఆమె తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో క్షమాపణలు కూడా చెప్పారు. పోలీసులు షర్మిస్తాకు పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించారు. కానీ ఆమెగాని, ఆమె కుటుంబ సభ్యులు గానీ దీనిపై స్పందించలేదు. చివరికీ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అక్కడ న్యాయస్థానం నుంచి అరెస్ట్‌ వారెంట్‌ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను గురుగ్రాంలో అదుపులోకి తీసుకున్నారు.   

Also Read: జాబ్ మానేసిన వ్యక్తిని చితక్కొట్టిన అమ్మాయిలు.. ఎందుకో తెలుసా..?

మే 14, 2025న షర్మిస్తా ఎక్స్‌లో ఆ వీడియో పోస్టు చేసింది. దానిపై ఓ పాకిస్థాన్ ఫాలోవర్ స్పందించారు. పహల్గాం ఘటన జరిగిన తర్వాత  భారత సైన్యం తీసుకున్న చర్యలపై అతడు ఆమెను ప్రశ్నించాడు. దీనికి ఆమె స్పందిస్తూ ఇస్లాం మతంపై, PBUHపై తీవ్రంగా స్పందించారు.  అయితే మతాన్ని కించపరిచేలా ఆమె వ్యాఖ్యానించడంతో అది వివాదానికి దారి తీసింది. ముస్లింలు ఆమెపై మండిపడ్డారు. . #ArrestSharmishta అనే హ్యాష్ ట్యాగ్ ‘ఎక్స్’లో ట్రెండ్ అయ్యిందంటే పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. పలు రాడికల్ పాకిస్థానీ ఉగ్రవాదుల గ్రూప్‌ నుంచి కూడా చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. ఇక్కడ మరోవైపు చూసుకుంటే ఆమెను అరెస్టు చేయడం అన్యాయమని. వెంటనే విడుదల చేయాలని #ReleaseSharmistha హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. ఆమె పాకిస్థానీయులను తిడితే మమతా బెనర్జీ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Also Read :  జూన్ 10న భారత్ బంద్..!

Also Read: మాట్లాడుకోడాల్ లేవు.. పాకిస్తాన్‌కు తుపాకులతోనే సమాధానం చెప్తాం

telugu-news | rtv-news | national-news | operation Sindoor

Advertisment
Advertisment
తాజా కథనాలు