/rtv/media/media_files/2025/03/18/9aRnl2I2zyrxpUqjrFb1.jpg)
Puducherry CM Rangaswamy key statement on language dispute
Language dispute: తమిళనాడు(Tamilnadu)లో భాష వివాదం నేపథ్యంలో కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి కీలక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ సంస్థలు, దుకాణాలు, వ్యాపార సముదాయాల పేర్లు తమిళంలో ఉండాల్సిందేనని సీఎం రంగస్వామి ఆదేశించారు. ఈమేరకు పలు సూచనలతో సర్క్యులర్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
2 భారతీయ భాషలు తప్పనిసరి..
ఈ మేరకు పుదుచ్చేరిలో తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్, ఫ్రెంచ్ అధికారిక భాషలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ తమిళభాష మాట్లాడేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో సీఎం రంగస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వర్గాలు వెల్లడించారు. అలాగే జాతీయ విద్యా విధానంలోని (NEP-2020) త్రిభాషా సూత్రంపై రాజకీయ వివాదం కొనసాగుతుండగా.. కొత్త విధానంలో 3 భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 2 భారతీయ భాషలు తప్పనిసరి. అయితే హిందీని దక్షిణాదిపై రుద్దడానికే కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని తమిళనాడుతోపాటు పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!
నిజానికి ఇది డీఎంకే, బీజేపీ మధ్య యుద్ధమే అయినా.. తమిళ సెంటిమెంట్ అంశంగా ఈ వివాదం రగులుతోంది. ఈ వివాదంలో సైలెంట్ గా ఉంటే తమకు నష్టం జరగడంతో పాటు డీఎంకేకు ప్లస్ గా మారుతుంది అనే కారణంతో తమిళనాడులోని మిగిలిన ద్రవిడ పార్టీలన్నీ డీఎంకేకు మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పార్టీని స్థాపించి డీఎంకేను పదేపదే వ్యతిరేకిస్తున్న నటుడు విజయ్ పార్టీ సహా.. తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డిఎంకే చిరకాల ప్రత్యర్థి అయిన అన్నాడీఎంకే కూడా డీఎంకే వాదనను బలపరుస్తోంది. తమిళులపై ఉచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్లమెంటులో మోషన్ కూడా డీఎంకే దాఖలు చేయడంతో తమిళనాడు మొత్తం ఇపుడు ఇదే అంశంపై బీజేపీకి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తుంది. బీజేపీ మాత్రం ఇప్పటికి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఈ వివాదం ఎక్కడదాకా వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!
Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!