CM Siddaramaiah : ఇంత జనం వస్తారని ఊహించలేదు : సీఎం సిద్ధరామయ్య

బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారని సీఎం వెల్లడించారు.

New Update
cm-siddaramaih

cm-siddaramaih

బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారని సీఎం వెల్లడించారు. తొక్కిసలాట ఘటన నిజంగా దురదృష్టకరమని తెలిపారు.

స్టేడియం కెపాసిటీ  35 వేలు మాత్రమేనని, కానీ లక్షల్లో జనాలు వచ్చారని.. ఇంతమంది వస్తారని ఊహించలేదన్నారు సీఎం. ఊహించిన దానికంటే భారీగా అభిమానులు రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు.  ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని సీఎం వెల్లడించారు. మృతి చెందిన వారికి రూ. 10లక్షల నష్టపరిహరాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని సీఎం వెల్లడించారు. ఈ ఘటనను బీజేపీ రాజకీయం చేయాలని చూస్తుందని మండిపడ్డారు సిద్ధరామయ్య.  

Advertisment
తాజా కథనాలు