Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ!

ప్రధాని మోదీ ISSలో ఉన్న ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌కు లేఖ రాశారు. ఆమె అంతరిక్ష యాత్ర నుంచి తిరిగొచ్చాక ఇండియా రావాలని ఆహ్వానించారు. మార్చి 1న మెదీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ Xలో షేర్ చేశారు.

author-image
By K Mohan
New Update
P M  Modi letter to Sunita Williams

P M Modi letter to Sunita Williams Photograph: (P M Modi letter to Sunita Williams)

ప్రధాని మోదీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో ఆమెను ఇండియా డాటర్ అని సంభోదించారు. ఆమెను భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. భారత ప్రధాని మోదీ మార్చి 1న సునీతా విలియమ్స్‌కు ఓ లేఖ రాశారు. అది నాసా మాజీ ఆస్ట్రోనాట్ మైక్ మాసిమినో ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి  పంపారు. ఆ లెటర్‌ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ Xలో షేర్ చేశారు. సునీతా విలియమ్స్ ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌ నుంచి 9 నెలల తర్వాత భూమీ మీదకు (భారతీయ కాలమాన ప్రకారం) మంగళవారం రానున్నారు. ఈ సందర్భంగా ఆమెకు గతంలో ప్రధాని మోదీ రాసిన లేఖ వార్తల్లో నిలిచింది. సునీతా విలియమ్స్‌ భారతీయ మూలాలు ఉన్న మహిళ. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌కు చెందిన వాడే.. ఆయన అమెరికాలో స్థిరపడి అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఆయనకు జన్మించిన చివరి సంతానమే సునీతా విలియమ్స్.  

Also Read :  గుజరాత్‌లో సునీతా విలియమ్స్ బావ యజ్ఞం

PM Modi Letter To Sunita Williams

Also read : ADR report: ఓటేసి నేరస్తులని అసెంబ్లీకి పంపిస్తున్నామా..? 45శాతం MLAలపై క్రిమినల్ కేసులు.. టాప్‌లో AP!

"మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, మీరు మా హృదయాలకు దగ్గరగా ఉంటారు. భారత ప్రజలు మీ మంచి ఆరోగ్యం మరియు మీ మిషన్‌లో విజయం కోసం ప్రార్థిస్తున్నారు" అని మార్చి 1న రాసిన లేఖలో మోడీ పేర్కొన్నారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా విలియమ్స్, ఆమె దివంగత తండ్రి దీపక్ పాండ్యాను కలిసిన విషయాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. సునీతా విలియమ్స్ భూమి మీదకు తిరిగి వచ్చాక.. భారతదేశంలో మిమ్మల్ని చూడటానికి మేము ఎదురు చూస్తున్నామని మోదీ పేర్కొన్నారు. భారతదేశ గొప్ప కుమార్తెల్లో ఒక్కరైన మీకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంటుందని రాశారు.

ఇది కూడా చూడండి:  Return Of The Dragon: ఓటీటీలోకి 'డ్రాగన్' ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

Also Read :  ఇక నుంచి ఆ పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు బంద్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు