Sunita Williams : గుజరాత్‌లో సునీతా విలియమ్స్ బావ యజ్ఞం

సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోడానికి గుజరాత్‌లో ఆమె తండ్రి తరుపు బంధువులు యజ్ఞం చేస్తున్నారు. ఆమె సేఫ్‌గా ల్యాండ్ అవ్వాలని గుజరాత్‌లోని దేవాలయాల్లో ఆమె బంధువులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇండియా మూలాలు ఉన్న ఆమె తండ్రిది గుజరాత్.

author-image
By K Mohan
New Update
sunita relative 123654

sunita relative 123654 Photograph: (sunita relative 123654)

సునీతా విలియమ్స్ భూమి మీదకు సురక్షితంగా చేరుకోవాలని ఆమె బంధువులు పూజలు నిర్వహిస్తున్నారు. నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మంగళవారం తెల్లవారుజామున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి స్పేస్‌ఎక్స్ క్రూ-9 క్యాప్యుల్‌లో బయలుదేరారు. 9 నెలల తర్వాత వారిద్దరూ భూమి మీదకు రాబోతున్నారు. వారితోపాటు వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌ కూడా ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్‌ అవనున్నారు. అంటే ఇండియ టైం అమెరికా కంటే 9గంటల 30 నిమిషాలు ఆలస్యంగా ఉంటుంది. ఇండియా కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్‌ భూమి మీద దిగనున్నుంది.

Also read: Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ!

Sunita Williams Safe Landing

Also Read :  ఇక నుంచి ఆ పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు బంద్..!

సునితా విలియమ్స్‌ తండ్రి గుజరాత్‌కు చెందిన వ్యక్తి. ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. దీంతో ఇండియాలో సునీతా విలియమ్స్ బంధువులు ఉన్నారు. ఆమె తండ్రి దీపక్ పాండ్య అక్క, చెల్లి ఇక్కడే ఉన్నారు. వారి కుటుంబాలతో సునీతా విలియమ్స్‌కి బంధుత్వం ఉంది. ఆమె సురక్షితంగా ల్యాండ్ అవ్వాలని గుజరాత్‌లో ఆమె బంధువులు పూజలు నిర్వహిస్తున్నారు. భూమి మీదకు సునీతా జర్నీ సేఫ్‌గా జరగాలని యజ్ఙం చేస్తున్నట్లు ఆమె కజిన్ దినేష్ రావల్ తెలిపారు. ఆమె వచ్చాక స్వీట్లు కూడా పంచుతామని ఆయన చెప్పారు. గుజరాత్‌లో దేవాలయాలకు వెళ్లి ఆమె బంధువులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆమె దేశానికే గర్వకారణమని తండ్రి తరపు బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సునీతా విలియమ్స్ అమెరికాలో ల్యాండ్ అవ్వగానే గుజరాత్‌లో సంబరాలు చేసుకుంటామని తెలిపారు.

Also read: Grok : ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌పై AIతో ప్రకాశ్‌రాజ్ సెటైర్లు

Also Read :  మా కుమార్తె చనిపోయిందని ప్రకటించండి.. సుదీక్ష తల్లిదండ్రుల షాకింగ్‌ రిక్వెస్ట్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు