/rtv/media/media_files/2025/03/18/NblKFyPl9J7bopug8FCZ.jpg)
ADR criminal report Photograph: (ADR criminal report)
కోర్టులు, పోలీస్‌స్టేషన్, జైళ్ల చుట్టూ తిరగాల్సిన వారంత దర్జాగా చట్టసభల్లో కూర్చుంటున్నారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపి 4,123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల టైంలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారిపై ఉన్న కేసులను స్టడీ చేసింది. వాటిని నేరారోపణలు, తీవ్రమైన నేరారోపణలు రెండు భాగాలుగా విభజించింది. ADR రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వారిలో 45 శాతం మందిపై క్రిమిలనల్ కేసులు ఉన్నాయిని తేలింది.
ఇది కూడా చూడండి: Return Of The Dragon: ఓటీటీలోకి 'డ్రాగన్' ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేల్లో 4,092 మంది క్రిమినల్ రిపోర్ట్‌ను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెలికితీసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. మొత్తం ఎమ్మెల్యేల్లో దాదాపు 45 శాతం అంటే 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వారిలో 25 శాతం అంటే 1,205 మంది హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు వారి ఆస్తుల విలువ కూడా ఎక్కువే. అన్ని రాష్ట్ర అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేల ఆస్తులు రూ.17.92 కోట్లు అని.. అయితే, క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఆస్తులు రూ.20.97 కోట్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
Crime in politics: 44% of Delhi's newly elected MLAs in 2025 have criminal cases—an improvement from 61% in 2020. Serious cases down from 53% to 24%.
— Ashok Upadhyay (@ashoupadhyay) February 9, 2025
Source: ADR Report pic.twitter.com/o8iYEC22ZL
ఆంధ్రప్రదేశ్ 174 మంది ఎమ్మెల్యేల్లో 138 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల లిస్ట్‌లో ఏపీ 59 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 50 శాతంతో తెలంగాణ, 49 శాతంతో బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి.
ఇక సాధారణ కేసుల్లో 70శాతం ఏపీ ఎమ్మెల్యేలు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత కేరళ, తెలంగాణలలో 69 శాతం, బీహార్ రాష్ట్రం 66 శాతం, మహారాష్ట్రలో 65 శాతం, తమిళనాడులో 59 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Hibiscus: ఇది పువ్వు మాత్రమే కాదు.. మందారం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు!
పార్టీల వారీగా చూస్తే.. తెలుగుదేశం పార్టీ 86 శాతంతో టాప్‌లో ఉంది. 134 మందిలో 115 మంది శాసనభ్యులపై నేరారోపణలు ఉన్నాయి. అంతేకాదు.. టీడీపీకి చెందిన 61 శాతం (82 మంది ఎమ్మెల్యేలు) ఎమ్మెల్యేలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేల్లో దాదాపు 39 శాతం అంటే 1,653 మంది శాసనసభ్యుల్లో 638 మంది క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. వారిలో 436 మంది అంటే 26 శాతం మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక 646 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 52శాతం అంటే 339 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 194 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని సదరు నివేదిక వెల్లడించింది.
తమిళనాడు అధికార డీఎంకేలో 74 శాతం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేల్లో దాదాపు 41 శాతం MLAలు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 54 మంది ఎమ్మెల్యేలు మర్డర్ కేసులో, 226 మందిపై అటామ్ట్ టూ మర్డర్, 127 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో 13 మంది అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.