/rtv/media/media_files/2026/01/17/thackeray-2026-01-17-09-27-46.jpg)
20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు కలిసినప్పటికీ ముంబై బీఎంసీని కాపాడుకోలేకపోయారు. నిన్న వెలువడిన మున్సిపల్ ఎన్నగల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలో మహాయుతి కూటమి చరిత్ర సృష్టించింది. గత 25 ఏళ్ళుగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేస్తున్న ఠాక్రే ఫ్యామిలీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఠాక్రే బ్రదర్స్ కలిసినా కూడా విజయం కలిసి రాలేదు. ఇద్దరూ కలిసి ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైందని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కూటమి ఏర్పాటు చేయడం కంటే రాజ్ ఠాక్రే వల్లే ఉద్ధవ్ ఠాక్రేకు ఎక్కువ నష్టం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరాఠా అతివాద భావాలే కారణం..
ముంబై ఎన్నికల్లో ఠాక్రే సోదరుల పనితీరుపై ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. మొత్తం ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే పోటీ చేసిన 213 స్థానాల్లో శివసేన 160 స్థానాల్లో పోటీ చేయగా 74 సీట్లలో విజయం సాధించింది. స్ట్రైక్ రేట్ 46 శాతం సాధించింది. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కూడా కేవలం 8 సీట్లకే పరిమితం అయింది. దీంతో ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే ఒక్కరే ఒంటరిగా పోరాడినా మెరుగైన ఫలితాలు వచ్చేవని..రాజ్ ఠాక్రే ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారని అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఠాక్రేలు ఓడిపోవడానికి కారణం రాజ్ ఠాక్రే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన గతంలో అనుసరించిన అతివాద మరాఠీ విధానాలు అంటే..మరాఠీ మాట్లాడని వారిపై దాడులు, పరభాషా విద్వేషం లాంటివి ఈ ఎన్నికల్లో ఠాక్రే బ్రదర్స్ కూటమిపై ప్రతికూల ప్రభావం చూపాయని చెబుతున్నారు. ముంబైలో కేవలం మరాఠీలు మాత్రమే ఉండరు. ఇతర రాష్ట్రాల ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. వారందరూ కావాలని రాజ్ ఠాక్రేకు ఓటమి వేయలేదని..బీజేపీకి వేశారని చెబుతున్నారు. రాజ్ ఠాక్రే భయంతో ఉద్ధవ్ కూటమికి దూరమై.. బీజేపీకి మద్దతు పలికారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన నుంచి ఉద్ధవ్ సేనకు ఓట్లు బదిలీ అయినప్పటికీ.. ఇతర వర్గాల ఓట్లు దూరం కావడం వల్ల ఉద్ధవ్ తన పాత కంచుకోటలను కూడా కోల్పోవాల్సి వచ్చింది.
కాంగ్రెస్ తో విడిపోవడం మరో తప్పు..
ఉద్ధవ్ ఠాక్రే చేసిన మరో తప్పు ఏంటంటే..కాంగ్రెస్ ను వదిలేయడం. కాంగ్రెస్ ను కాదని రాజ్ ఠాక్కేతో కలవడమే ఆయన చేసిన తప్పిదమని ఫలితాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ముంబైలోని ముస్లింలు, మరాఠీయేతర వర్గాల్లో మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి ఉంటే.. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండేది. ఠాక్రేలతో ఎన్సీపీ కూటమి కలిసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
Follow Us