india new baggage rules : వారికి  గుడ్ న్యూస్.. విదేశాల నుంచి 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

సాధారణంగా మనం ఏదైనా దేశ పర్యాటనకు వెళ్లినపుడు అక్కడ నుంచి బంగారు నగలు కొనుక్కు తెచ్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. దీనికి కారణం భారత్ తో పోలిస్తే విదేశాల్లో బంగారం క్వాలిటీగా ఉంటుందని, ధర తక్కువకు వస్తుందని వారు భావించడమే.

New Update
gold

gold

india new baggage rules : సాధారణంగా మనం ఏదైనా దేశ పర్యాటనకు వెళ్లినపుడు అక్కడ నుంచి బంగారు నగలు కొనుక్కు తెచ్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. దీనికి కారణం భారత్ తో పోలిస్తే విదేశాల్లో బంగారం క్వాలిటీగా ఉంటుందని, ధర తక్కువకు వస్తుందని వారు భావించడమే. అలా అనుకునే వారికి ప్రభుత్వం ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. విదేశాల నుంచి బంగారు అభరణాలు కొనుక్కొని తెచ్చుకోవచ్చని తేల్చి చెప్పింది.

 దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంతో పోలిస్తే బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి.ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో సుమారు 394% మేర పెరుగుదల నమోదు చేసింది. అయితే విదేశాల్లో ధరలు తక్కువగా ఉంటాయని, క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటారు. ఈ నేపథ్యంలోబ్యాగేజీ నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకువచ్చింది. కొత్తగా బ్యాగేజీ నిబంధనలు-2026 అమల్లోకి తెచ్చింది. ఇవి ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ఫలితంగా విదేశాల నుంచి విమానం లేదా సముద్ర మార్గాల్లో మనదేశానికి వచ్చే ప్రయాణికులు మహిళలైతే 40 గ్రాములు, పురుషులైతే 20 గ్రాముల వరకూ డ్యూటీ ఫ్రీగా బంగారు నగలు కొని తెచ్చుకోవచ్చు.
 
 అయితే దీనికి ఒక కండీషన్‌ ఉంది. అదెంటంటే బంగారం కొనేవారు  ఏడాదికి పైగా విదేశాల్లో నివసించి తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులైనా అయి ఉండాలి. ఈ ఆభరణాలు వ్యక్తిగత వినియోగం కోసమే తీసుకురావాలి తప్ప అమ్మకానికి కాదు. బంగారం బిస్కెట్లు, బంగారం కడ్డీల రూపంలో ఉండే బంగారానికి మాత్రం ఈ మినహాయింపులు ఉండవు. ఇప్పటివరకు మహిళలు రూ.లక్ష, పురుషులు రూ.50వేల విలువైన ఆభరణాలే విదేశాల నుంచి తెచ్చుకునే వీలుండేది. బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చారు.

నగలకు వ్యాల్యూ క్యాప్ తొలగింపు గతంలో రూ.లక్ష వరకూ విలువ పరిమితి ఉండేది.. లేదా బరువు పరిమితి ఉండేది. ఇప్పుడు ఆ విలువ పరిమితి పూర్తిగా తొలగించారు. బదులుగా బరువు పరిమితి ఆధారంగా మాత్రమే డ్యూటీ-ఫ్రీ చేశారు.గతంలోని పాత పరిమితులతో మహిళలకు (లేడీ ప్యాసెంజర్) 40 గ్రాముల బరువు వరకు లేదా రూ.లక్ష విలువ వరకు (ఏది తక్కువైతే అది). అంటే, ఆభరణాల విలువ రూ.లక్ష మించకుండా, 40 గ్రాముల వరకు కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. పురుషులకు లేదా ఇతర ప్యాసెంజర్లు 20 గ్రాముల బరువు వరకు లేదా రూ.50,000 విలువ వరకు (ఏది తక్కువైతే అది). అంటే, ఆభరణాల విలువ రూ.50,000 మించకుండా, 20 గ్రాముల వరకు డ్యూటీ-ఫ్రీ ఉండేది. ఇప్పుడు.. అంటే ఇవాళ్టి నుంచి విలువను తొలగించి, కేవలం బరువును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు