/rtv/media/media_files/2025/04/04/qPxMojpKdgYeOFyAxOvJ.jpg)
Stalin and Draupadi Murmu
తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. డీఎంకే పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని స్టాలిన్ అసెంబ్లీలో వెల్లడించారు. వైద్య విద్యలో ప్రవేశాలకై నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని గత కొన్నేళ్లుగా డీఎంకే సర్కార్ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. '' తమిళనాడు సర్కార్ నీట్‌పై వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్రాన్ని మినహాయించేందుకు కేంద్రం తిరస్కరిస్తోంది.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
ఇలా చేయడం దక్షిణాది రాష్ట్రాలను అవమానించడమే అవుతుంద. కేంద్రం మన అభ్యర్థనను తిరస్కరించవచ్చు కానీ మన పొరాటాన్ని మాత్రం ఆపలేరు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సవాల్ చేసేందుకు న్యాయపరంగా ఇతర మార్గాలు అన్వేషిస్తామని'' స్టాలిన్ అన్నారు. మరోవైపు ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష మీటింగ్‌కు కూడా పిలుపునిచ్చారు.
ఇదిలాఉండగా నీట్ పరీక్ష వల్ల తమిళనాడులో విద్యార్థుల సూసైడ్‌లు పెరుగుతున్నాయని డీఎంకే ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నీట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చి సరైన ర్యాంక్ రాకపోవడంతో పలువురు విద్యార్థులు మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడును నీట్ నుంచి శాశ్వతంగా మినహాయించాలంటూ అక్కడి ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది.
Also Read: వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి
దీని ప్రకారం చూసుకుంటే 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య, విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. దీన్ని 2021, 2022లో రెండుసార్లు అసెంబ్లీలో ఆమోదించారు. ఆ తర్వాత గవర్నర్‌కు పంపించగా పలుమార్లు తిరస్కరించారు. అనంతరం బిల్లులో కొన్ని మార్పులు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. కానీ తాజాగా రాష్ట్రపతి ముర్ము కూడా దీన్ని తిరస్కరించారు.
tamilnadu | telugu-news | rtv-news | stalin | neet | national-news