/rtv/media/media_files/2025/05/05/WvU4OjnNSlJ6JWf8Vtoc.jpg)
President to visit Sabarimala
Droupadi Murmu : కేరళలో ఉన్న శబరిమల ఆలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అయ్యప్పమాల ధారణతో విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే అక్కడికి దాదాపు ఆడవారికి అనుమతి ఉండదు. పదేళ్లలోపు బాలికలు, 50 దాటిన మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే తాజాగా దేశ తొలిపౌరురాలు ద్రౌపది ముర్ము శబరిమలను సందర్శించనున్నారు. గతంలో ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారెవరూ శబరిమలను సందర్శించకపోవడం విశేషం. దీంతో శబరిమలను సందర్శించే ప్రెసిడెంట్‌గానే కాకుండా తొలిమహిల ప్రెసిడెంట్‌గా ముర్ము రికార్డు సృష్టించనున్నారు.
ఇది కూడా చదవండి: అధిక ఉష్ణోగ్రత వల్ల ఈ సమస్యలు తప్పవు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు కేరళ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు సోమవారం పర్యటన వివరాలను వెల్లడించాయి. ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్రపతి ముర్ము కేరళలో పర్యటించనున్నారు. 18వ తేదీన రాష్ట్రపతి కొట్టాయం చేరుకుంటారు. అక్కడ జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 19వ తేదీన పంపా బేస్ క్యాంపుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయానికి చేరుకొంటారు. అయితే, అందరి భక్తుల్లా రాష్ట్రపతి కొండపైకి వెళ్తారా.. లేక అత్యవసర అవసరాల కోసం ఉపయోగించే రహదారి ద్వారా ఆలయానికి చేరుకుంటారా అన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు శబరికొండలను ఎక్కడం అంత సులువు కాదు కనుక ముర్ము వయసును దృష్టిలో పెట్టుకుని డోలి (మనుసులను కొండపైకి చేర్చేందుకు వినియోగించేవి) ద్వారా వారు కొండపైకి చేరుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
దీనిపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిర్ణయం తీసుకుంటుందని ట్రావెన్‌కోర్ దేవస్థానం ప్రెసిడెంట్ ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము ఓ రికార్డు నెలకొల్పనున్నారు. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రెసిడెంట్‌గా ముర్ము నిలవనున్నారు.
Also Read : PM Modi: ఆర్మీ సూట్‌లో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
Also read : TGSRTC : బస్సు భవన్ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..