PM Modi: ఆర్మీ సూట్‌లో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
ప్రధాని మోదీ ఓ సభలో ఉగ్రవాదం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయం చేసేవాళ్లు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు.
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత వేళ.. ఇరుదేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలకు పూర్తి అధికారాలు ఇచ్చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, నావీ చీఫ్‌లతో కూడా సమావేశం అయ్యారు. పాకిస్తాన్‌పై భారత్ బలమైన దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ కోలుకోకుండా త్రివిధ దళాలు ఇప్పటికే బ్లూప్రింట్ తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ ఓ సభలో ఉగ్రవాదం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ వీడియోలో ప్రధాని ఆర్మీ సూట్‌లో ఉన్న దృశ్యాలు కనిపించాయి. అలాగే ఓ సభలో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. '' ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే మా నినాదం. ఏ దేశం కూడా నిస్సహాయ స్థితిలో ఉండకూడదు. భారత్‌పై 40 ఏళ్లుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. బాంబు దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయం చేసేవాళ్లు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోలేదు. నాకు రాజకీయాలు, పదవులు కాదు.. దేశ ప్రజల భద్రతే ముఖ్యం. ప్రతి అంశంలో కూడా మనం రాజకీయాలు చేయకూడదంటూ'' ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైన పాక్‌పై భారత సైన్యం దాడులు చేయొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ మరోసారి కీలక భేటీ నిర్వహించారు. ఆదివారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం.
అలాగే పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి వ్యూహాత్మక విధానాలు అనుసరించాలో మాట్లాడినట్లు తెలుస్తోంది. పహల్గాగం ఘటన జరిగిన తర్వాత ఇప్పటికే ప్రధాని మోదీ భారత ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్.. ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత నావీ చీఫ్ అడ్మైరల్ దినేష్.. ప్రధాని మోదీతో సమావేశం అయిన 24 గంటల్లోనే ఐఏఎఫ్ చీఫ్‌తో సమావేశం జరిగింది. ఈ భేటికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాట్ జనరల్ అనిల్ చౌహన్, అలాగే ఇతర చీఫ్‌లు కూడా హాజరయ్యారు.

PM Modi

Also Read: కాళ్ల బేరానికి దిగిన పాకిస్తాన్.. ఐక్యరాజ్య సమితి ఎమర్జెన్సీ మీటింగ్

Also Read: కెనడా నుంచి హిందువులు వెళ్లిపోవాలి.. మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ బొమ్మలను బోనులు బంధించి..!
అలాగే పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి వ్యూహాత్మక విధానాలు అనుసరించాలో మాట్లాడినట్లు తెలుస్తోంది. పహల్గాగం ఘటన జరిగిన తర్వాత ఇప్పటికే ప్రధాని మోదీ భారత ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్.. ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత నావీ చీఫ్ అడ్మైరల్ దినేష్.. ప్రధాని మోదీతో సమావేశం అయిన 24 గంటల్లోనే ఐఏఎఫ్ చీఫ్‌తో సమావేశం జరిగింది. ఈ భేటికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాట్ జనరల్ అనిల్ చౌహన్, అలాగే ఇతర చీఫ్‌లు కూడా హాజరయ్యారు.
pm modi | telugu-news | terrorism | Pahalgam attack