/rtv/media/media_files/2025/05/05/TC0qnI04epMjwFnN9HFs.jpg)
Anti-Hindu parade in Toronto by Khalistanis, caged effigies of PM, Amit Shah
కెనడాలో ఖలిస్థానీలు రెచ్చిపోతున్నారు. వాళ్ల దుశ్చర్యలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా మరో సంచలన డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. కెనడాలో ఉంటున్న 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలని నిరసనలు చేశారు. టొరొంటోలోని మాల్డన్ గురుద్వారాలో ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో బోన్లో పెట్టి ప్రదర్శనలు చేశారు.
Also Read: వీడు భర్త కాదు బండరాయి.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తినేశాడు వెధవ!
ఇటీవల ఖలిస్థానీ మద్దతుదారులు గురుద్వారా, మందిరంలో విధ్వసం చేశారు. దీంతో కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు షవన్ బిండా దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళనలు కావని.. ఖలిస్థానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత అని అన్నారు. కెనడాలో జరిగిన భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణమని తెలిపారు.
మరోవైపు కెనడాకు చెందిన జర్నలిస్ట్ డానియల్ బోర్డమన్ కూడా హిందూ వ్యతిరేకతను రెచ్చగొడుతూ ఖలిస్థానీలు చేపట్టిన ఓ ప్రొగ్రామ్ వీడియోను షేర్ చేశారు. అలాగే ఖలిస్థానీయులపై చర్యలు తీసుకోవడంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ, మాజీ ప్రధాని ట్రూడోకు ఏదైనా తేడా ఉందా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Also Read: కీలక అప్డేట్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మరో టెర్రరిస్ట్ అరెస్టు
ఇక ఖలిస్థానీలు మన దేశంలోని కేంద్ర మంత్రులను కూడా బెదిరిస్తున్నారు. అయితే ఇటీవల రైల్వేశాఖ సహాయమంత్రి రవనీత్ సింగ్ బిట్టూను హత్య చేసేందుకు వాళ్లు కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. సోషల్ మీడియాలో లీకైన పలు స్క్రీన్షాట్లు కూడా తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అంతేకాదు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఖలిస్థానీ సంస్థ వారిస్ పంజాబ్దే నేతలు కక్ష పెంచుకున్నారన్నారు.
Also Read: నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల ముసలవ్వ.. చదువుకు వయసు అడ్డం కాదని నిరూపించింది
telugu-news | rtv-news | national-news | canada | khalistani-terrorists | khalistan