Maha Kumbh Mela: కుంభమేళాకు రాష్ట్రపతి ... పుణ్యస్నానమచారించిన ముర్ము!

మహాకుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పుణ్యస్నానం చేశారు.ప్రయాగ్‌రాజ్‌ లోని త్రివేణి సంగమం వద్ద ఆమె స్నానమచారించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు.

New Update
murmu

murmu

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025) లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) సోమవారం పుణ్యస్నానం చేశారు.ప్రయాగ్‌రాజ్‌ లోని త్రివేణి సంగమం వద్ద ఆమె స్నానమచారించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు.

Also Read: Bangladesh:బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్‌ డేవిల్‌ హంట్‌..1300 మంది అరెస్ట్‌!

ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌,ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలికారు.తర్వాత వారితో కలిసి ద్రౌపదీ ముర్ము బోటులో పర్యటించారు.మార్గమధ్యలో
ఆమె పక్షులకు ఆహారం అందించారు.

Also Read: Telangana: తెలంగాణ లో కొత్త వైరస్‌..25 ఏళ్ల మహిళ మృతి!

144 ఏళ్లకోసారి వచ్చే...

ఆ తరువాత త్రివేని సంగమం వద్దకు చేరుకొని పుణ్యస్నానమాచరించి పూజలు చేశారు.144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి భారత్‌ తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ వేడుక జరగనుంది.

ఇప్పటి వరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపారరంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్యపౌరులు కలిపి 44 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారని యూపీ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. కుంభమేళా మొదలై 28 రోజులు గడుస్తున్నప్పటికీ రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్‌ రాజ్‌ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా దాదాపు 200-300 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ లే కనపడుతున్నాయి.

Also Read: Lay Offs: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్‌ కంపెనీలు

సుమారు 48 గంటల పాటు ట్రాఫిక్‌ లోనే చిక్కుకున్నట్లు అనేక మంది ప్రయాణికులు చెబుతున్నారు. 50 కిలోమీటర్ల మేర దూరానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని అంటున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ప్రయాగ్‌ రాజ్‌కు వెళ్తున్న వాహనాల రద్దీ దృష్ట్యా ..ఆదివారం నాడుమధ్య ప్రదేశ్‌ పరిధిలోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్‌ ను ఎక్కడికక్కడే నిలిపేశారు. 

Also Read: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు