Ambati Rambabu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైసీపీ నేత అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టికెట్ రేట్లు పెంచేందుకు హీరోలను పిలిపించుకోవాలా అంటూ 'గేమ్ ఛేంజర్' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పవన్ చేసిన విమర్శలపై రాంబాబు మండిపడ్డారు. హీరోలతో నమస్కారం పెట్టించుకునే మనస్తత్వం తమది కాదంటూ సెటైర్స్ వేశారు. ఒక హీరోను అన్యాయంగా అరెస్టు చేస్తే 27 రోజులు నోరు విప్పకుండా ఇప్పుడు వేదాలు వళ్లిస్తున్నారంటూ పవన్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం మాది కాదు-- పవన్ కళ్యాణ్తోటి హీరోని అన్యాయంగా అరెస్టు చేస్తే27 రోజులు నోరు విప్పకపోవడంమీ స్వభావం @PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) January 4, 2025 అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం.. ఈ మేరకు పవన్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టిన రాంబాబు.. 'హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం మాది కాదు పవన్ కళ్యాణ్. తోటి హీరోని అన్యాయంగా అరెస్టు చేస్తే 27 రోజులు నోరు విప్పకపోవడం మీ స్వభావం' అంటూ విమర్శలు గుప్పించారు. గురు శిష్యులు కలిసి ఆ హీరోను అబాసుపాలు చేశారని, తమకు నచ్చిన వారిని మాత్రం భుజానేసుకు తిరుగుతున్నారన్నారు. గురువు ఆజ్ఞ శిష్యుడు అమలు అల్లు అర్జున్ అరెస్టు నా మాట కాదు.. ఇది జనం మాట!@ncbn @revanth_anumula @alluarjun — Ambati Rambabu (@AmbatiRambabu) December 14, 2024 పవన్ ఏమన్నారంటే.. సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం తమ ప్రభుత్వానికి ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం టాలీవుడ్ కు అండగా ఉంటుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ మీద గౌరవం ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తుందన్నారు. టిక్కెట్ల ధరలు పెంచేందుకు గత ప్రభుత్వం మాదిరి హీరోలను పిలవబోమని, టిక్కెట్ల ధరలు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా టాక్స్ రూపంలో ఆదాయం వస్తుందన్నారు. కొంతమంది ధరల పెంపుని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, సినీ ఇండస్ట్రీ గురించి సినిమాలు తీసేవారు మాత్రమే మాట్లాడాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.