Bihar Elections: నేను ఎన్నికల్లో పోటీ చేయను..ప్రశాంత్ కిశోర్

బీహార్ లో ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు తాను ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించారు సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్. పార్టీ కోసం మాత్రమే పని చేస్తానని చెప్పారు. 

New Update
prashath kishore

prashath kishore

Bihar Elections: సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. తన పార్టీ తరుఫున పని చేస్తానని...కానీ పోటీ చేయనని చెప్పారు. సురాజ్ పార్టీ తరుఫు అభ్యర్థుల రెండో జాబితా ఈ మధ్యనే విడుదల చేశారు. దీనిలో కూడా ప్రశాంత్ కిశోర్ పేరు లేకపోవడంతోనే చర్చ మొదలైంది. ఇప్పుడు తాను బరిలో నిలుచోవడం లేదని స్పష్టం చేశారు. 

ఇది కూడా చూడండి: Health Tips: పార్కిన్సన్ వ్యాధి నాడి పట్టేసిన శాస్త్రవేత్తలు.. ఎలానో మీరూ తెలుసుకోండి!!

దీనికి వారం రోజుల మందు ప్రశాంత్ కిశోర్ గురించి చాలా వార్తలు బయటకు వచ్చాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఎన్నికల వ్యూహకర్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని ఊహాగానాలు వినించాయి. దీనికి లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయాల్లో 'తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని' అనడం ఈ చర్చలకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా బిహార్‌లో అధికార కూటమి అయిన బీజేపీ-జేడీయూ మధ్య, ఎల్జేపీకి సీట్ల కేటాయింపు విషయంలో పొత్తు కుదరడం లేదు. దీంతో చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్ కలిసి బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తారని అన్నారు. 

బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీ..

కానీ ప్రశాంత్ కిశోర్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకున్న దాఖలాలు కనిపించలేదు. ఆయన తన పార్టీనే బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పాశ్వాన్‌కు ముఖ్యంగా దళిత ఓటర్లలో బలమైన ఓటు బ్యాంకు ఉండగా, ప్రశాంత్ కిషోర్‌కు వ్యూహాత్మక అనుభవం, యువతలో ఆదరణ ఉన్నాయి. ఈ రెండు శక్తులు కలిస్తే బిహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీట్ల పంపకంపై ఎన్డీఏలో తుది నిర్ణయం వెలువడకముందే, చిరాగ్ పాశ్వాన్-ప్రశాంత్ కిషోర్ పొత్తుపై 'తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి' అని ఎల్జేపీ వర్గాలు చెప్పడం బిహార్ రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తోంది. 

Also Read: Indian Origin: అమెరికా రహస్యాలు చైనాకు..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

Advertisment
తాజా కథనాలు