Indian Origin: అమెరికా రహస్యాలు చైనాకు..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

అమెరికా రక్షణకు సంబంధించి సమాచారాన్ని చైనాకు పంపిస్తున్నారనే అభియోగంతో భారత సంతతికి చెందిన ఆష్లే టెల్లీస్ అరెస్ట్ అయ్యారు. చైనా అధికారులతో కూడా ఈయన సీక్రెట్ మీటింగ్ లు జరిపినట్లు తెలుస్తోంది. 

New Update
Ashly

భారత సంతతికి చెందిన ఆష్లే టెల్లీస్..డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ లో కాంట్రాక్టర్ గా పని చేశారు. ప్రస్తుతం ఈయన వయసు 64 ఏళ్ళు. అయితే ఈయనపై ఇప్పుడు దేశ ద్రోహ అభియోగాలు మోపబడ్డాయి. యూఎస్‌ న్యాయవాది లిండ్సే హాలిగన్‌ ఒక పత్రికా ప్రకటనలో ఆష్లేపై ఉన్న అభియోగాలను ప్రకటించారు. 2001 నుంయి అమెరికా రక్షణ విభాగంలో పని చేస్తున్న ఆష్లే...అమెరికాకు సంబంధించిన సమాచారాన్ని తన దగ్గర చట్టవిరుద్ధంగా ఉంచుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ఇళ్ళల్లో సోదాలు చేయగా..సీక్రెట్ టాప్ సీక్రెట్ అని ఉన్న వెయ్యికి పైగా పత్రాలు దొరికాయి. 

చైనాకు రహస్య సమాచారం చేరవేత..

దీంతో పాటూ రీసెంట్ గా ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న తన సహోద్యిగినిని రహస్య పత్రాలకు సంబంధించిన ప్రింట్లు ఇవ్వమని వేధించినట్లుగా కూడా తెలుస్తోంది. యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్‌ చేసినట్లు ఫెడరల్ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీఒక ఎత్తైతే...తను సేకరించిన సమాచారాన్ని అంతటినీ ఆష్లే చైనాకు చేరవేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. కొన్ని ఏళ్ళుగా ఆయన చైనా ప్రతినిధులతో రహస్య సమావేశాలు జరిపాడని చెబుతున్నారు. 2022తో పాటు 2023 ఏప్రిల్‌ 11న బీజింగ్‌ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి భేటీ ఒకటి జరిగిందని..అందులో చైనా అధికారుల నుంచి ఆష్లేకు గిఫ్ట్ గా క్యాష్ బ్యాగ్ కూడా లభించిందని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ పక్కా ఆధారాలతో దొరకడంతో ఆష్లేను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఇందులో కనుక ఆష్లే దోషి అని తేలితే..10 ఏళ్ల వరకు జైలు  శిక్ష పడటంతో పాటు 2,50,000 డాలర్ల జరిమానా పడనుంది.

Also Read: Rohith-Kohli: దానికి ఇంకా రెండున్నరేళ్ళ టైమ్ ఉంది..ఇప్పుడు ఆడకపోతే కష్టం..రోకోపై కోచ్ గంభీర్