PM Modi: జాతినుద్దేశించి మోదీ సంచలన ప్రకటన!

నవరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో మోదీ కీలక కామెంట్స్ చేశారు. అర్థరాత్రి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలు అవుతున్నాయని చెప్పారు. ఈ సంస్కరణల వల్ల  పెద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఆదాయం మిగులుతుందన్నారు.

New Update
PM Narendra Modi Urges Indians to not Buy Foreign Goods

PM Narendra Modi Urges Indians to not Buy Foreign Goods

నవరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో మోదీ కీలక కామెంట్స్ చేశారు. మోదీ తన ప్రసంగంలో మాట్లాడుతూ..  రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలవుతున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా అడుగులు వేస్తున్నాం. జీఎస్టీ(GST) సంస్కరణలతో పేద, మధ్యతరగతి ఎంతో ఆదాయం మిగులుతోంది. పండగల సమయంలో దేశంలోని అందరికీ మేలు జరుగుతుంది. జీఎస్టీ సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతుందన్నారు. 

 2017లో జీఎస్టీతో కొత్త అధ్యాయం మొదలైంది. అంతకు ముందు ఎన్నో రకాల పన్నులు ఉండేవి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్న పన్నులు కట్టాల్సి ఉండేది. జీఎస్టీ సంస్కరణలు ఎఫ్‌డీఐలను మరింత ప్రోత్సహిస్తాయి. గతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చి వస్తువులు అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. గతంలో టాక్స్‌, టోల్‌తో కంపెనీలన్ని ఇబ్బందులు పడ్డాయి. ఆ భారమంతా వినియోగదారులపై పడేదన్నారు. 

జీఎస్టీకి ప్రాధాన్యం ఇచ్చాం

2024లో గెలిచిన తరువాత జీఎస్టీకి ప్రాధాన్యం ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలపై అన్ని వర్గాలతో మాట్లాడాం. వన్‌ నేషన్‌- వన్‌ టాక్స్‌ కలను సాకారం చేశాం. అన్ని రంగాల్లో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయి.  కొత్త జీఎస్టీతో నిత్యావసర వస్తువులన్ని మరింత చౌకగా మారతాయి. జీఎస్టీ సంస్కరణలు దేశాన్ని మరింత బలంగా మారుస్తుంది. కొన్నింటిపై పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చాం. మరికొన్నింటిపై 5 శాతం పన్ను మాత్రమే వేశాం. రూ.12 లక్షల వరకుక ఆదాయపన్నును తొలగించాం. ఈ చర్యలతో మధ్య తరగతి జీవితాల్లో ఎంతో మార్పు రానుంది. కొత్త జీఎస్టీతో పేద మధ్యతరగతివారికి డబుల్‌ బొనాంజా. టీవీ, ఫ్రిజ్‌, స్కూటర్‌, ఇంటి నిర్మాణంపై ఖర్చు తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణలు అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. 

నాగరికత దేవోభవ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. 99 శాతం వస్తువులు 5 శాతం శ్లాబుల్లోకి మార్చాం. చిన్న పరిశ్రమలే భారత్‌ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దిక్సూచిగా మారాయి. అంతా స్వదేశీ వస్తువులనే ప్రోత్సాహించాలి. మన దేశంలో తయారయ్యే వస్తువులనే కొనాలి. స్వదేశీ వస్తువులను కొన్నామని గర్వంగా చెప్పండి అని మోదీ తెలిపారు.  

Also Read : OG Ticket Bookings: అమ్మతోడు ఒక్క టికెట్ ఖాళీ లేదు భయ్యా!.. 'ఓజీ ' ఊచకోత

Advertisment
తాజా కథనాలు