OG Ticket Bookings: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న' ఓజీ' మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'ఓజీ' మేనియా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీ పోస్టర్లు, వీడియోలతో సోషల్ మీడియా మారుమోగుతోంది. ఇప్పటికే మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ ఓజీ టికెట్ల పై దండయాత్ర చేస్తున్నారు. ఇలా బుకింగ్స్ ఓపెన్ చేయగానే అలా క్లోజ్ అయిపోతున్నాయి. బుక్ మై షో క్రాష్ అయిపోయే రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2025/09/21/og-tickets-2025-09-21-16-36-56.jpeg)
హౌజ్ ఫుల్
ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రముఖ థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డులు తిప్పేశాయి. బుక్ మై షోలో సంధ్యా, శ్రీరాములు, ఏఎంబీ, గోకుల్, సుదర్శన్, బీఆర్ హైటెక్ మాదాపూర్ ఏషియన్ వంటి ప్రముఖ థియేటర్లు హౌజ్ ఫుల్ చూపిస్తున్నాయి. ఏఎంబీ గచ్చిబౌలిలో ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ లాస్ట్ షో వరకు ఒక్క టికెట్ కూడా ఖాళీ లేదు. మిగిలిన థియేటర్స్ కూడా దాదాపు ఫుల్ అయిపోయాయి.. అక్కడక్క ఖాళీ ఉన్నాయి. రేపటి వరకు అవి హౌజ్ ఫుల్ అయిపోతాయని తెలుస్తోంది. హైదరాబాద్ కి చెందిన ఓ అభిమాని ఏకంగా లక్ష రూపాయలు పెట్టి 'ఓజీ' టికెట్ కొన్నాడు. ఇంకా ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఈ స్థాయిలో హైప్ క్రియేట్ అవడం ప్రేక్షకుల్లో ఓజీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. ఈరోజు ఉదయం ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది.. సాయంత్రానికి పోస్ట్ ఫోన్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. కేవలం ఇండియాలోనే అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోల ద్వారా రూ. 5 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'ఓజీ' ఫీవర్ పీక్స్ లో ఉంది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియాలో 'OG' అడ్వాన్స్ బుకింగ్స్ కి ఊహించని స్పందన లభించింది. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద థియేటర్ మెల్బోర్న్ IMAX టికెట్లు కేవలం 2 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. ఇక నార్త్ అమెరికాలో 50,000 కంటే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. ప్రీమియర్ ప్రీ సేల్స్ లో అత్యంత వేగంగా $1 మిలియన్ దాటిన తెలుగు సినిమాగా 'ఓజీ' నిలిచింది. దీని ప్రకారం ఓవర్ సీస్ లో.. దాదాపు రూ. 40 కోట్ల వరకు ఓపెనింగ్ సాధించవచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఓవర్ సీస్ లో కూడా ఓజీ ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.
గ్యాంగ్ స్టార్ డ్రామా
గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రన్ని ప్రభాస్ 'సాహూ' ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ లో పవన్ కళ్యాణ్ స్టైల్, మాస్ యాక్షన్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లాయి. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.