వాతావరణ పరిస్థితులను అంచనా వేసే సాంకేతికతను దాదాపు అన్ని దేశాలు వాడుతున్నాయి. మన దేశంలో కూడా భారత వాతావరణ శాఖ ఏ చోట వర్షాలు పడతాయో, తుపానులు వస్తాయో ముందుగానే అంచనా వేస్తాయి. కానీ ఈ అంచనాలు కొన్నిసార్లు నిజమవుతాయి. మరికొన్నిసార్లు కావు. వర్ష ప్రభావ తీవ్రతను కూడా వాతావరణ శాఖ చాలాసార్లు సరిగ్గా పసిగట్టలేవు. దీనివల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రదేశాల్లోకి తరలించలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలా కచ్చితమైన వాతావరణ అంచనాలు లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
Also Read: Paracetamol - PAN D టాబ్లెట్స్ వేసుకునే వారికి బిగ్ షాక్.. !
ఈ నేపథ్యంలోనే వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితత్వంతో పసిగట్టే సాంకేతిక రానుంది. దీనివల్ల ఎక్కడ, ఎంత వాన పడుతుందో గంటల ముందుగానే పక్కగా గుర్తించవచ్చు. ప్రస్తుత వాతావరణ మోడల్స్‌ను విశ్లేషించేందుకు సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని భారత్ మరో మూడు రేట్లు పెంచింది. పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ (IITM)లో, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (NCMRWF)లో వాతావరణ పరిశీలనలకు వాడుతున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యం 6.8 పెటాఫ్లాప్స్‌గా ఉంది. ఇప్పుడు రూ.850 కోట్ల వ్యయంతో ఈ రెండింటి సామార్థ్యాన్ని ఏకంగా 22 పెటాఫ్లాప్స్‌కు పెంచారు. అరుణిక, అర్కా అనే ఈ రెండు సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ పూణెలో గురువారం ప్రారంభించాల్సి ఉంది. అయితే అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇది వాయిదా పడింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ కంప్యూటర్లు 12 కిలోమీటర్ల గ్రిడ్ పరిమాణంతో మాత్రమే శాటిలైట్ చిత్రాలను విశ్లేషించగలవు. అందుకే అప్పటికప్పుడు మారిపోయే వాతవరణ పరిస్థితుల్ని కచ్చితంగా అంచనా వేయడంలో పొరపాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ గ్రిడ్ పరిమాణాన్ని 6 కిలోమీటర్లు తగ్గించగలిగితే ఎక్కడ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందో కచ్చితత్వంతో చెప్పే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ సూపర్ కంప్యూటర్ల సామార్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 6.8 పెటాఫ్లాప్స్ నుంచి 22 పెటాఫ్లాప్స్‌కు పెంచితే ఇది సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు వాటి సామర్థ్యాన్ని పెంచారు.
Also Read: పెన్షన్ కోసం 2 కి.మీ మోకాళ్లపై.. వృద్ధురాలు!
పూణెలోని హెచ్‌పీసీ, ఐఐటీఎం ప్రాజెక్టు డైరెక్టర్ సూర్య చంద్రరావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) వ్యవస్థను ప్రారంభించిన తర్వాత రెండు నెలల్లో ఇది పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి వస్తుంది. పూణెలోని సూపర్ కంప్యూటర్ (అర్కా) వాతవరణ మోడల్స్‌ను మాత్రమే కాదు.. వాతావరణ మార్పులపై కూడా పనిచేస్తుంది. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించుకునేలా దీన్ని అభివృద్ధి చేశారు. వాతావరణ సూచనలు, మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెరుగుతున్న అసాధరణ వాతావరణ పరిస్థితుల గురించి ముందుగానే పక్కాగా హెచ్చరికలు ఇచ్చే అవకాశాలున్నాయని'' సూర్య చంద్రరావు తెలిపారు.