Odisha: ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో 70 ఏళ్ల వికలాంగ మహిళ తన వృద్ధాప్య పింఛను పొందేందుకు స్థానిక పంచాయతీ కార్యాలయానికి దాదాపు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన వారంతా అక్కడి పంచాయతీ అధికారుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పాతూరి దేహూరి అనే 70 ఏళ్ల వికలాంగ వృద్దురాలు..తాను జీవించడం కోసం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌పై ఆధారపడింది. అంతేకాకుండా ఆమెకు సహాయం చేసేవారు కూడా ఎవరూ లేరు. ఒక ప్రమాదంలో ఆమె తన రెండు కాళ్లను కోల్పోయింది. వికలాంగురాలు అయిన తర్వాత, ఆమె సరిగ్గా నడవలేకపోతుంది. సంక్షేమ పింఛన్లను ఇంటి వద్దకే అందజేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించినప్పటికీ, వృద్ధురాలు తన ఇంటికి పింఛను పంపిణీ చేయకపోవడంతో టెల్కోయ్ బ్లాక్‌లోని రైసువాన్ పంచాయతీ కార్యాలయానికి అలాగే వెళ్లాల్సి వచ్చింది.
ఇలా నడవడం వల్ల పాతూరికి పాదాలు, మోకాళ్లు, చేతులపై బొబ్బలు పుట్టించింది. ఈ క్రమంలో ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ.."పంచాయతీ కార్యనిర్వాహక అధికారి (పిఇఒ) నా పెన్షన్ తీసుకునేందుకు కార్యాలయానికి రమ్మని చెప్పారు. నాకు సహాయం చేయడానికి ఎవరూ లేకపోవడంతో, కార్యాలయానికి చేరుకోవడానికి 2 కి.మీలు ఇలా రావడం తప్ప నాకు వేరే మార్గం లేదు" అని చెప్పుకొచ్చింది.
అంగీకరించిన అధికారి
పంచాయతీ కార్యనిర్వాహక అధికారి సంఘటనను అంగీకరించారు. అయితే ఆమె పరిస్థితి గురించి తనకు తెలియదని తెలిపారు. ఆమె ప్రమాదానికి ముందు, ఆమె స్వయంగా ఆఫీసుకు వచ్చి పెన్షన్ తీసుకోవడానికి వచ్చేవారు. "ఆమె ఇంతకుముందు ఆఫీసుకు నడుచుకుంటూ తన పింఛను తీసుకునేది. కానీ ప్రమాదంలో ఆమె కాలు దెబ్బతినడంతో, మా ఆఫీసు ప్యూన్ ఆమె ఇంటికి పింఛను అందజేస్తున్నారు" అని అధికారి వివరించారు.
రైసువాన్ పంచాయతీ సర్పంచ్ పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేశారు, ప్రమాదం తరువాత ఆమె కష్టాలు తమకు తెలియవని వివరించారు. ‘‘వృద్ధురాలు ఆఫీసుకు పాకాల్సి వచ్చిందని మాకు తెలియదు. ఇటీవల ప్రమాదానికి గురై నడవడానికి ఇబ్బంది పడి ఉండవచ్చు. ప్రతినెలా 15వ తేదీలోగా ఆమె ఇంటికి పింఛను, రేషన్ అందజేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాం. ,” అని సర్పంచ్ చెప్పినట్లు తెలుస్తుంది.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు. వచ్చే నెల నుంచి ఆమెకు అవసరమైన అన్ని సహాయాలు అందేలా చూస్తామని, ఈ విషయాన్ని అధికారులకు చెప్పామని హామీ ఇచ్చారు.
A 80 year old woman has to crawl 2 Km to panchayat office in Telkoi block of Odisha's Keonjhar to collect her old-age pension.
— Neetu Khandelwal (@T_Investor_) September 24, 2024
This happened despite Government directive to deliver allowances to homes of elderly and disabled beneficiaries. pic.twitter.com/4XXlpU8cAM