PM Modi: దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు: ప్రధాని మోదీ

దేశాన్ని విచ్చిన్నం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శలు చేశారు. భారతీయ మత, సాంస్కృతిక సంప్రదాయాలను వారు వ్యతిరేకిస్తున్నారంటూ మండిపడ్డారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
PM Modi

PM Modi

దేశాన్ని విచ్చిన్నం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శలు చేశారు. భారతీయ మత, సాంస్కృతిక సంప్రదాయాలను వారు వ్యతిరేకిస్తున్నారంటూ మండిపడ్డారు. మహాకుంభమేళాపై ఇటీవల విపక్షాలు చేసిన విమర్శలపై మోదీ తీవ్రంగా స్పందించారు. వాళ్లందరూ బానిస మనస్తత్వ కలిగిన వారంటూ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని చత్తార్‌పూర్‌లో భాగేశ్వర్‌ ధామ్ మెడికల్ అండ్ సెంటర్ సైన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.  

Also Read: ఫ్రీగా కుంభమేళా ట్రిప్.. రూపాయి ఖర్చు పెట్టకుండా 1500KM ప్రయాణం

ఈ సందర్భంగా మాట్లాడుతూ '' ఈ మధ్యకాలంలో ప్రజల్ని విభజించే నేతల గుంపును చూస్తున్నాం. హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్దాల నుంచి ఏదో ఒక దశలో ఉంటున్నారు. బానిస మనస్తత్వం కలవారే మన విశ్వాసాలు నమ్మకాలు, సంస్కృతిపై దాడి చేస్తున్నారు. వీళ్లు మన పండుగలు, సంప్రదాయాలను దుర్వినియోగం చేస్తారు. సమాజాన్ని విభజించడం, ఆ తర్వాత ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే వాళ్ల అజెండా'' అని ప్రధాని మోదీ అన్నారు.  

Also Read: కనీస మద్దతు ధరకు రూ.30వేల కోట్లు కేటాయించండి.. రైతుల డిమాండ్

అలాగే క్యాన్సర్‌కు కారణమయ్యే సిగరెట్, బీడీ, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా క్యాన్సర్‌ నియంత్రణ కోసం పలు ప్రకటనలు చేశామని తెలిపారు. క్యాన్సర్‌ ఔషధాలు మరింత చౌకగా దొరికేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో కూడా క్యాన్సర్‌ డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 

Also Read: మైనర్‌ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు