Farmers: కనీస మద్దతు ధరకు రూ.30వేల కోట్లు కేటాయించండి.. రైతుల డిమాండ్

పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాల నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆరో విడత చర్చలు శనివారం జరిగాయి. MSP అమలుకు ఏడాదికి రూ.30 వేల కోట్లు కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు.

New Update
Farmers

Farmers

పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘాల నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆరో విడత చర్చలు శనివారం జరిగాయి. చండీగఢ్‌లో మహాత్మగాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సమావేశం కొనసాగింది. ఇందులో కేంద్ర మంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, పియూష్‌ గోయల్, ప్రహ్లాద్‌ జోషితో పాటు 28 మంది రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.  

Also Read: మన్ కీ బాత్.. తెలంగాణ బిడ్డపై ప్రధాని మోదీ ప్రశంసలు..

మార్చి 19న మరోసారి చండీగఢ్‌లో సమావేశం కావాలని నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ తెలిపారు. కేంద్రం కనీస మద్దతు ధరలను అమలు చేసేందుకు కట్టుబడి ఉంటే ఏడాదికి రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల నిధులు కేటాయించడం పెద్ద సమస్య కాదని రైతు నేతలు అన్నారు. ఎమ్‌ఎస్పీ అమలుకు ఏడాదికి రూ.30 వేల కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Also Read: మైనర్‌ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

కనీస మద్దతు ధర వల్ల కలిగే ప్రయోజనాలు వివరించగా.. సాధికార గణాంకాలను కేంద్ర బృందం కోరిందని రైతు నేతలు తెలిపారు. వీటిని వారం రోజుల్లో అందిస్తామని తాము చెప్పినట్లు పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాలకు చెందిన జగ్జిత్ సింగ్‌ డల్లేవాల్‌, స్వరణ్ సింగ్‌ తదితర రైతు నేతలు, ఇద్దరు పంజాబ్ రాష్ట్ర మంత్రులు చర్చల్లో పాల్గొన్నారు.    

Also Read: తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్స్..ఎప్పటినుంచంటే...

Also Read: మవోలకు మరో దెబ్బ.. భారీ డంప్ స్వాధీనం.. పోలీసుల చేతికి కీలక సమాచారం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు