ఫ్రీగా కుంభమేళా ట్రిప్.. రూపాయి ఖర్చు పెట్టకుండా 1500KM ప్రయాణం

కుంభమేళాకు ఫ్రీగా 1500 కి.మీ లిఫ్ట్‌ అడిగే ప్రయానించాడు ఓ యువకుడు. థానేకు చెందిన దివ్య ఫొఫానీ కేవలం రెండు రోజుల్లోనే ప్రయాగ్‌రాజ్ చేరుకున్నాడు. ప్రస్తుతం అతని ట్రావెల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రక్, బైక్‌తోపాటు కొంత దూరం కాలినడక కూడా చేశాడు.

New Update
divya pofani

divya pofani Photograph: (divya pofani)

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా.. హిందూ భక్తులందరీ చూపులు అటే.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 144 ఏళ్లకు ఓసారి వచ్చే మహాకుంభమేళా కావున దీన్ని గొప్ప అదృష్టంగా భావిస్తారు. ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నవాళ్లు వెళ్తారు. లేని వారి ఇలా వార్తల్లో, టీవీల్లో చూస్తూ కుర్చుంటారు. రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఓ యువకుడు 1500 కిలీమీటర్లు ప్రయాణించి కుంభమేళాలోని ప్రయా‌గ్‌రాజ్‌ను దర్శించుకున్నారు. కంటెంట్ క్రియేటర్ దివ్య ఫొఫానీ ఫిబ్రవరి 12న దివ్య మహారాష్ట్ర థానే నుంచి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరాడు. అతని మొత్తం ప్రయాణం లిఫ్ట్‌ ద్వారానే కొనసాగింది. అపరిచిత వ్యక్తులతో స్కూటర్, ట్రక్, కార్ల మీద లిఫ్ట్ తీసుకొని 1500 కిలో మీటర్ల ప్రయాణించాడు. 

Also Read: మన్ కీ బాత్.. తెలంగాణ బిడ్డపై ప్రధాని మోదీ ప్రశంసలు..

‘లిఫ్ట్‌’ అని రాసిన ప్లకార్డును చేతపట్టుకుని ముంబై శివారులోని థానే నుంచి బయలుదేరిన ఫొఫానీ తొలి విడతలో బైకులు, స్కూటర్లు, కార్లు, ట్రక్కులపై ప్రయాణించి నాగ్‌పూర్‌కు చేరుకోవడం ద్వారా తన మొత్తం 1,500 కి.మీ. యాత్రలో సగభాగాన్ని పూర్తిచేశారు. తదుపరి విడతలో జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌) వరకు పలువురు లిఫ్ట్‌ ఇవ్వడంతో ఆయన ప్రయాణం సాఫీగానే సాగింది.

Also read: పోప్‌ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!

జబల్‌పూర్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ వరకు ట్రక్కులకు అనుమతించకపోవడంతో అనేక సవాళ్లు ఎదురయ్యాయని, అయినప్పటికీ స్థానికుల తోడ్పాటుతో యాత్రను పూర్తి చేయగలిగానని అన్నారు. కేవలం 2 రోజుల్లోనే ప్రయాగ్‌రాజ్ చేరుకున్నాడు దివ్య ఫొఫానీ. తన ట్రావెల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన పోస్టుకు ఇప్పటికే 36 వేలకుపైగా లైక్‌లు వచ్చాయి. ఈ యాత్ర తనకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని, పవిత్ర స్థలాన్ని చేరుకునేందుకు భారతీయులు ఎలాంటి సంకోచం లేకుండా పరస్పరం ఎలా సహకరించుకుంటారో ఈ ప్రయాణంలో ప్రత్యక్షంగా చూశానని, అపరిచితుల దయాగుణంతోపాటు అద్భుతమైన మన దేశ ఐక్యతపై తనకున్న విశ్వాసాన్ని ఈ యాత్ర మరోసారి చాటిచెప్పిందని ఫొఫానీ పేర్కొన్నారు. అతని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు