/rtv/media/media_files/2025/11/22/pm-modi-proposes-three-initiatives-at-g20-2025-11-22-21-24-47.jpg)
PM Modi proposes three initiatives at G20
సౌత్ ఆఫ్రికాలో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచాభివృద్ధి కోసం పలు కీలక ప్రతిపాదనలు చేశారు. 'సమగ్ర, సుస్థిర ఆర్థికాభివృద్ధి' విషయంపై ప్రసంగించారు. ప్రపంచాభివృద్ధి ప్రమాణాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. అందరినీ కలుపుకునేలా స్థిరమైన అభివృద్ధిపై ఫోకస్ పెట్టడం అవసరమని తెలిపారు. భారత నాగరికతా విలువలు, సమగ్ర మానవతావదం ఈ అంశంగా మార్గాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు.
Also Read: మావోయిస్టు పార్టీ బిగ్ షాక్.. లొంగిపోయిన మరో 37 మంది మావోయిస్టులు
మాదకద్రవ్యాలతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జీ 20 సమావేశం చొరవను ప్రధాని ప్రతిపాదించారు. మాదర ద్రవ్యాలు ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను బలహీనం చేద్దామన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వేగంగా స్పందించేలా మరో ప్రతిపాదన చేశారు. అలాగే ట్రైనింగ్ పొందిన వైద్య నిపుణులతో 'జీ 20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్'ను ఏర్పాటు చేయాలన్నారు. సంప్రదాయాన్ని రక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సును మెరుగుపర్చేందుకు 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ అంశంలో భారత్‌కు గొప్ప చరిత్ర ఉందన్నారు.
Also Read: చైనా మరో అద్భుతం.. సముద్రంలో తెలియాడే ఆర్టిఫిషియల్ ఐలాండ్.. దీని ప్రత్యేకత ఇదే !
మరోవైపు ప్రపంచం అభివృద్ధి చెందాలంటే ఆఫ్రికాలో వృద్ధి చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం 'జీ20 ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనీషియేటివ్'ను ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే దశాబ్దంలో ఆఫ్రికాలో 10 లక్షల మంది శిక్షకులను తయారుచేయడం దీని టార్గెట్ అని తెలిపారు. ఇక జీ20 అధ్యక్ష హోదాలో భారత్ ఉన్న క్రమంలో.. ఇందులో ఆఫ్రికన్ యూనియన్ కూడా భాగం కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
#BREAKING | PM Modi Proposes Three Key Global Initiatives at the G20 Summit in Johannesburg
— NDTV (@ndtv) November 22, 2025
NDTV's @AdityaRajKaul shares more details pic.twitter.com/BNdPshllh9
Also Read: NCRTC కీలక నిర్ణయం.. ఇకనుంచి రైళ్లలో కూడా వేడుకలు
Follow Us