/rtv/media/media_files/2025/11/22/namo-bharat-trains-2025-11-22-19-48-01.jpg)
Namo Bharat trains available for private celebrations, pre-wedding shoots
సాధారణంగా రైళ్లను ప్రయాణాల కోసమే వినియోగిస్తుంటారు. కానీ ఇకనుంచి రైళ్లలో కూడా ప్రైవేటు వేడుకలు చేసుకోవచ్చు. తాజాగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC)(Namo Bharat Trains) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్ల కోసం చేసుకునే ఫొటోషూట్, బర్త్ డే వేడుకలతో పాటు ఇతర ప్రైవేటు ఈవెంట్లకు రైలు బోగీలు అద్దెకిస్తున్నామని ప్రకటన చేసింది. వ్యక్తులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఫొటోగ్రఫీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. అయితే ఇది ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ మధ్య నడుస్తున్న నమో భారత్ రైళ్లకు మాత్రమే వర్తిస్తుంది.
Also Read: రెండేళ్ల నుంచే ఉగ్రదాడులకు ప్లాన్.. పేలుళ్ల కేసులో సంచలన నిజాలు
Namo Bharat Trains Available For Private Celebrations
స్టేషన్లలో నిలిపి ఉన్న బోగీలను లేదా కదులుతున్న నమో భారత్ రైలు బోగీలను కస్టమర్లు రెంట్‌కు తీసుకోవచ్చు. వేడుకల కోసం ఉత్తరప్రదేశ్‌లోని దుహాయ్ డిపో వద్ద ఓ శాంపిల్ బోగీని కూడా అలంకరించి అందుబాటులో ఉంచుతారు. ఇక ఈ బోగీలకు గంటకు రూ.5 వేలుగా బుకింగ్ ఛార్జీలు నిర్ణయించారు. ఈ వేడుకకు కావాల్సిన డెకరేషన్ సామాగ్రిని సెట్ చేసుకునేందుకు మరో 30 నిమిషాల సమయం ఇస్తారు. ఈ సౌకర్యం కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యే ఉంటుంది.
దీనికి సంబంధించి పలు రూల్స్ కూడా ఉన్నాయి. బోగిల్లో వేడుకలు చేసుకునేవాళ్లు సాధారణ రైలు కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగించకూడదు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకూడదు. అంతేకాదు ఈ వేడుకలు కూడా ఎన్‌సీఆర్టీసీ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలోనే నిర్వహిస్తారు. ఢిల్లీ-మేరఠ్ కారిడార్‌లో ఆనంద్ విహార్, ఘజియాబాద్, మేరఠ్ సౌత్ స్టేషన్లలో ఏర్పాటు చేయనున్న ఈ సౌకర్యం ఎంతోమందని ఆకర్షిస్తుందని NCRTC భావిస్తోంది.
Also read: భారతీయులలో పెరుగుతున్న ఊబకాయం..అంతా ఫుడ్ డెలివరీ వల్లనే..
మరో విషయం ఏంటంటే సినిమా షూట్‌లు, డాక్యుమెంటరీ, యాడ్స్ లాంటి ఇతర వాటి కోసం కూడా నమో భారత్ రైళ్లు, స్టేషన్లలను కూడా NCRTC అద్దెకు ఇవ్వనుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఓ విధాన్ని కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో నమో భారత్ రైళ్లను కేంద్రం మరింత విస్తరించనుంది. దీంతో మిగతా ప్రాంతాల్లో కూడా ఈ రైళ్లలో వేడుకలు చేసుకునే సౌకర్యం అందరికీ అందుబాటులోకి రానుంది.
Follow Us