China: చైనా మరో అద్భుతం.. సముద్రంలో తెలియాడే ఆర్టిఫిషియల్ ఐలాండ్.. దీని ప్రత్యేకత ఇదే !

టెక్నాలజీ రంగంలో చైనా రోజురోజుకు దూసుకుపోతోంది. ఎల్లప్పుడూ వినూత్న ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా చైనా చేపట్టిన మరో ప్రయోగం సంచలనం రేపుతోంది. ఈసారి ఏకంగా ఓ ఫ్లోటింగ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్‌ను నిర్మిస్తోంది.

author-image
By B Aravind
New Update
China Building World's 1st Artificial Floating Island That Can Survive Nukes

China Building World's 1st Artificial Floating Island That Can Survive Nukes

టెక్నాలజీ రంగంలో చైనా రోజురోజుకు దూసుకుపోతోంది. ఎల్లప్పుడూ వినూత్న ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా చైనా చేపట్టిన మరో ప్రయోగం సంచలనం రేపుతోంది. ఈసారి ఏకంగా ఓ ఫ్లోటింగ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్‌ను నిర్మిస్తోంది. ఇది చైనా విమాన వాహన నౌక అయిన ఫుజియాన్ పరిణామంలో ఉంటుంది. దీని బరువు సుమారు 78 వేల టన్నులు. సముద్రంలో ఇది కదులుతూ ముందుకు వెళ్లగలదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ ఫ్లోటింగ్ ఐలాండ్‌ను ఏకంగా అణు దాడులను కూడా తట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మెటామెటీరియల్ శాండ్‌విచ్‌ ప్యానెల్స్‌ను వినియోగిస్తున్నారు.      

దీనిలో మొత్తం 238 మంది సిబ్బంది ఎలాంటి బయటి సరఫాలు లేకుండా కూడా నాలుగు నెలల పాటు ఉండవచ్చు. అంతేకాదు ఇది కేటగిరీ 17 తుపానులు, 6 నుంచి 9 మీటర్ల ఎత్తైన అలలను కూడా తట్టుకోగలదు. 2028 నాటికి ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించాలని చైనా టార్గెట్ పెట్టుకుంది. దీన్ని శాస్త్రీయ పరిశోధలన కోసమే నిర్మిస్తున్నామని చైనా చెబుతోంది. కానీ దీని నిర్మాణం సైనిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం వల్ల ఇది వ్యూహాత్మక, సైనిక ప్రయోజనాలకు కూడా వాడొచ్చని తెలుస్తోంది. అంతేకాదు ప్రపంచంలోనే అణుదాడిని తట్టుకునే మొదటి ఫ్లోటింగ్ ఐలాండ్‌ అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.  - ai-technology

Also Read: మావోయిస్టు పార్టీ బిగ్ షాక్.. లొంగిపోయిన మరో 37 మంది మావోయిస్టులు

China Building World's 1st Artificial Floating Island

ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్‌కు సముద్రంలో కదులుతూ ఎక్కడైనా ఉండగలిగే సామర్థ్యం ఉంది. దీంతో వివాదాస్పదంగా ఉన్న దక్షిణ చైనా సముద్రం లాంటి కీలక ప్రాంతాల్లో ఇది తాత్కాలిక లేదా శాశ్వత సైనిక స్థావరంగా పనిచేసుందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే సముద్రంలోని వివిధ పాయింట్ల నుంచి నిఘా, గస్తీ కార్యకలాపాలు నిర్వహించేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. సాధారణంగా పరిశోధన స్థావరానికి అణు దాడులను తట్టుకునే రక్షణ అవసరం ఉండదు.కానీ దీన్ని వాటిని తట్టుకునేలా రూపొందించడంతో యుద్ధ సమయంలో కూడా ఇది నిరంతరాయంగా పనిచేసే అవకాశముంది. కీలక సైనిక కమాండ్‌, కమ్యూనికేషన్‌ హబ్‌గా కూడా ఉపయోగించేందుకు వీలు ఉండనుంది. తీవ్ర ఉద్రిక్తతల సమయంలో కూడా ఈ ఐలాండ్ కీలక కార్యకలాపాలు కొనసాగించే ఛాన్స్ ఉంటుంది.  

లోతైన సముద్ర పరిశోధనలో కూడా ఈ ప్రాజెక్టు చైనా యొక్క సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చైనాకు సముద్ర ఖనిజాలు, జీవవైవిధ్యం, ఇతర వ్యూహాత్మక వనరులపై నియంత్రణను పెంచడంలో దోహదపడుతుందని అంటున్నారు. అంతేకాదు యుద్ధ నౌకలకు, సబ్‌మెరైన్‌లకు, డీప్‌సీ డ్రోన్‌లకు ఇంధనం నింపేందుకు, మరమ్మతులు చేసేందుకు, అలాగే విశ్రాంతి తీసుకోవడానికి ఓ కీలక ప్లాట్‌ఫారమ్‌గా పనిచేయనుందని చెబుతున్నారు. 

Also Read: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహితకు బిగ్ షాక్‌.. అవార్డు తీసుకుంటే నేరమే

Advertisment
తాజా కథనాలు