/rtv/media/media_files/2025/11/08/pm-modi-2025-11-08-15-25-09.jpg)
PM Modi
బీహార్‌లో మొదటి దశ ఎన్నికలు ముగియగా.. అక్టోబర్ 11న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీతామర్హిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బీహార్ విద్యార్థులకు మేము ల్యాప్‌టాప్‌లు ఇందిస్తే వాళ్లు రివల్వర్లు ఇస్తున్నారంటూ ఆర్డేడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. '' విద్యార్థులకు మేము కంప్యూటర్లు, ఫుట్‌బాల్, హాకీ స్టిక్‌లు ఇస్తున్నాం. ఆర్జేడీ మాత్రం ప్రజలకు రివాల్వర్లు ఇవ్వడంపై మాట్లాడుతోంది.
Also Read: ఆ ఊళ్లో 2 వేల నాటుకోళ్లు వదిలి వెళ్లిన అగంతకులు.. పండుగ చేసుకున్న ప్రజలు
ప్రజలు తుపాకుల ప్రభుత్వం కావాలని కోరడం లేదు. ఆర్జేడీ ఎన్నికల ప్రచారంలో జంగిల్‌రాజ్ పాటులు, నినాదాలు వింటే షాక్ అవుతారు. పిల్లలను దోపిడీదారులుగా మార్చేందుకు యత్నిస్తున్నారు. బిహార్‌లో పిల్లలు డాక్టర్లు కావాలా లేదా దోపిడీదారులు కావాలా ?. మన పిల్లలను చెడ్డవాళ్లుగా చేయాలనుకునేవారిని మనం గెలిపిస్తామా ?. కాంగ్రెస్,ఆర్జేడీకి పరిశ్రమలకు సంబంధించి ఏ,బీ,సీ,డీ లు కూడా తెలియవు. కానీ పరిశ్రమలను మాత్రం ఎలా మూసివేయాలో తెలుసు.
Also Read: స్కూల్లో వేధింపులే ఆత్మహత్యకు కారణం..జైపూర్ తొమ్మిదేళ్ల పాప అమైరా తల్లిదండ్రులు
జంగిల్ రాజా 15 ఏళ్ల పాలనలో బీహార్‌లో పెద్ద ఆస్పత్రి గానీ.. వైద్య కళాశాల కానీ ఏర్పాటు చేయలేదు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో NDA కూటమి వచ్చాకే ఇక్కడి ప్రజలకు నమ్మకం వచ్చింది. పెట్టుబడిదారులు బీహార్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను నిందించిన వాళ్లను ఎన్నికల్లో శిక్షించాలని'' ప్రధాని మోదీ అన్నారు.
RJD वाले बिहार के बच्चों के लिए क्या करना चाहते हैं, ये इनके नेताओं के चुनाव प्रचार में साफ-साफ दिखता है।
— BJP (@BJP4India) November 8, 2025
RJD के मंचों पर मासूम बच्चों से कहलवाया जा रहा है कि उन्हें रंगदार बनना है।
RJD के लोग बिहार के युवाओं को कट्टा और दुनाली देने की बात कर रहे हैं।
- पीएम श्री @narendramodi… pic.twitter.com/rsJz6UeGvl
Follow Us