PM Modi: 65 లక్షల మందికి పైగా ఆస్తి కార్డుల పంపిణీ చేసిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ శనివారం స్వామిత్వ పథకం కింద ప్రజలకు ఆస్తి కార్డులు పంపిణీ చేశారు. వర్చువల్ విధానం ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 65 లక్షల మందికి పైగా ఈ కార్డులు అందించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
PM Modi

PM Modi

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు సాధికారత కల్పించేందుకు కేంద్రం సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్‌డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌ (SVAMITVA) స్కీమ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ శనివారం ఈ స్వామిత్వ పథకం కింద ప్రజలకు ఆస్తి కార్డులు పంపిణీ చేశారు. వర్చువల్ విధానం ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 65 లక్షల మందికి పైగా కార్డులు అందించారు. అయితే ఈ స్కీమ్ కింద దేశంలో 10 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 230 జిల్లాల్లోని లబ్ధిదారులు ఈ కార్డులు అందుకున్నారు. 

Also Read: మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!

మొత్తంగా 50 వేల గ్రామాల్లోని లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ''ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షలాది మంది ఈ స్వామిత్వ స్కీమ్‌ ద్వరా ప్రయోనాలు పొందుతున్నారు. 

Also Read: Maha kumbh melaకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ప్యాకేజీని అందిస్తున్న ఐఆర్‌సీటీసీ

5 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇప్పటిదాకా 1.5 కోట్ల మందికి స్వామిత్వ ఆస్తి కార్డులు పంపిణీ చేశాం. ఈరోజు మరో 65 లక్షల కుటుంబాలకు ఈ కార్డులు అందజేశాం. దీనివల్ల గ్రామాల్లోని 2.25 కోట్లమంది తమ ఇంటికి సంబంధించిన శాశ్వత ఆస్తి కార్డులను పొందారని'' ప్రధాని మోదీ అన్నారు. 

Also Read: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!

Also Read: ఉద్యోగం ఊడినా పరువు మాత్రం సేఫ్.. చైనాలో ఫేక్ జాబ్ ట్రెండ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు