/rtv/media/media_files/2025/06/12/tV8nDNpDlcys64OoXH2A.jpg)
Pilot Issued mayday call before air india plane crash
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు విమానం బయలుదేరింది. విమాన ప్రమాదానికి ముందు సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి పైలట్ MAYDAY కాల్ చేశాడు. కానీ ఏటీసీకి ఎలాంటి సిగ్నల్ వెళ్లలేదు. చివరికి విమానం కుప్పకూలిపోయింది.
Also Read: కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం.. షాకింగ్ వీడియోలు!
మేడే కాల్ అంటే
మేడే కాల్ అనేది విమానం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుటు పైలట్ ఇచ్చే అత్యవసర సందేశం. విమానం ఇంజిన్ పనిచేయకపోవడం, విమానం మంటల్లో చిక్కుకోవడం, గాలిలో ఢీకొనే ప్రమాదం లేదా హైజాక్ వంటి పరిస్థితులు ఉన్నప్పుడు పైలట్ మేడే కాల్ చేస్తాడు. ఈ కాల్ ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు తక్షిణ సాయం అవసరమని హెచ్చరిస్తాడు. విమానం రేడియోలో మూడుసార్లు "మేడే, మేడే, మేడే" అని చెబుతారు.
Also Read: బిగ్ అప్‌డేట్.. కుప్పకూలిన విమానంలో మాజీ సీఎం
ఈ కాల్ వచ్చాక కంట్రోల్ రూమ్ ఆ విమానానికి ప్రాధాన్యత ఇస్తుంది. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి, రన్‌వే క్లియర్ చేయడం, అంబులెన్స్, అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచడం లాంటి సాయం చేస్తుంది. మేడే అనే పదం ఫ్రెంచ్ పదమైన మైడర్ నుంచి వచ్చింది. నాకు సాయం చేయి అని దీని అర్ధం.