ఒకటి, రెండు గంటలు లేట్ అయితేనే మనకు చాలా చిరాకు వచ్చేస్తుంది. అలాంటిది ఏకంగా 16 గంటలు అంటే..ఇక అంతే. ముంబైలో ఎయిర్ పోర్ట్‌లో వంద మంది ప్రయాణికులు ఇదే పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. సాంకేతిక లోపం కారణంగా 16 గంటల ఆలస్యం కావడంతో ఇస్తాంబుల్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. టెక్నికల్ ఇష్యూను సరిచేయాలని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయత్నించింది అయితే అది ఎంతకూ అవ్వకపోయేసరికి మొత్తం ఫ్లైట్ నే రద్దు చేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
ఉదయం వెళ్ళాల్సిన ఫ్లైట్ రాత్రి 11 గంటలకు..
ఈరోజు ఉదయం 6.55 గంటలకు ఇస్తాంబుల్‌కి బయలుదేరాల్సిన ఫ్లైట్ 6E17ను రద్దు చేసింది ఇండిగో ఎయిర్ లైన్స్. ఇది ఇప్పుడు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని ఎయిర్‌లైన్స్ చెప్పింది. మా ఫ్లైట్ 6E17, వాస్తవానికి ముంబై నుండి ఇస్తాంబుల్‌కి నడపాల్సి ఉంది అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైనందుకు మేము చింతిస్తున్నాము. దురదృష్టవశాత్తు, సమస్యను సరిదిద్దడానికి, గమ్యస్థానానికి పంపించడానికి మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, చివరికి మేము విమానాన్ని రద్దు చేయవలసి వచ్చింది అని ఇండిగో చెప్పింది. ప్రత్యామ్నాయ విమానాన్ని రాత్రి 11 గంటలకు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఇండిగో విమానం ఆలస్యం అవడం వలన చాలా మంది ప్రయాణికులు ఎఫెక్ట్ అయ్యారు. దీనివలన తమ పనులు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్టర్నేట్ విమానం వేసినప్పటికీ రిఫండ్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది మొరటుగా ప్రవర్తించారని, చాలాసేపు రీషెడ్యూల్, రీఫండ్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆరోపించారు. కొంత మంది తమకు ఇస్తాంబుల్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయని...ఇప్పుడు ఈ ఆలస్యంగా కారణంగా అవి మిస్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ఢిల్లీని ముంచెత్తిన వానలు..ఎల్లో అలెర్ట్..100 ఏళ్ళల్లో ఇదే మొదటసారి