డిసెంబర్ లో ఇంతలా వానలు కురవడం 101 సంవత్సరాలలో ఇదే తొలిసారి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఈరోజు ఉదయం 8:30 గంటల వరకు 24 గంటల్లో 41.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంతా ఢల్లీలో వాన పడడం చివరిగా 1923 డిసెంబర్ 3న నమోదైంది. అప్పట్లో ఒకేరోజు 75.7 మి.మీ. కురిసి ఢిల్లీని అతలాకుతలం చేసింది. ఇక నిన్న సాయంత్రం 5:30 గంటల వరకు నగరవ్యాప్తంగా 31.4 మిమీ, పాలెం వద్ద 31.4 మిమీ, లోధి రోడ్‌లో 34.2 మిమీ, రిడ్జ్‌లో 33.4 మిమీ, ఢిల్లీ యూనివర్సిటీలో 39 మిమీ, పూసాలో 35 మిమీ వర్షపాతం నమోదైంది. ఎల్లో అలెర్ట్... అసలే డిసెంబర్‌లో చాలా చలిగా ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు వానలు కూడా పడుతుండడంతో ఢిల్లీకి ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మరో రెండు రోజులు ఇలానే వర్షం పడే అవకాశం ఉందని...అందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీకెండ్లో ఉష్ణోగత్రలు మరింత పడిపోవచ్చని హెచ్చరించింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని తెలిపింది. అయితే ఇప్పుడు కురిసిన వర్షపాతం వలన ఒక మంచి కూడా జరిగింది. చాలా నెల నుంచి పొల్యూషన్‌లో కూరుకుపోయిన ఢిల్లీ ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతోంది. ఢిల్లీలో గాలి నాణ్యత కాస్త మెరుగుపడిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. ఉదయం 11 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 142తో నాణ్యత కొద్దిగా పెరగటానికి వర్షపాతం దోహదపడింది. Also Read: చెన్నై గ్యాంగ్ రేప్ ఘటన.. నిందితుడికి డీఎంకేతో సంబంధాలు !