Supreme Court: ఆపరేషన్ సిందూర్‌లో పనిచేసినంత మాత్రాన హత్య కేసులో రక్షణ ఇవ్వలేం: సుప్రీంకోర్టు

తాను ఆపరేషన్‌ సిందూర్‌లో పనిచేశానని.. భార్య హత్య కేసులో మినహాయింపు కల్పించాలని కోరిన కమాండోకు సుప్రీంకోర్టు చురకలంటించింది. దీనిపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కారణంతో కేసు నుంచి రక్షణ కల్పించేది లేదంటూ తేల్చిచెప్పింది.

New Update
Supreme Court

Supreme Court

సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తాను ఆపరేషన్‌ సిందూర్‌లో పనిచేశానని.. భార్య హత్య కేసులో మినహాయింపు కల్పించాలని కోరిన కమాండోకు అత్యున్నత న్యాయస్థానం చురకలంటించింది. దీనిపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కారణంతో కేసు నుంచి రక్షణ కల్పించేది లేదంటూ తేల్చిచెప్పింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లో బ్లాక్‌ క్యాట్‌ కమాండో యూనిట్లో ఓ కమాండో పనిచేస్తున్నారు. 
ఆయనపై వరకట్నం కోసం తన భార్యను చంపాడనే ఆరోపణలతో కేసు నమోదైంది. దీనిపై 2004లో పంజాబ్‌లోని ఓ ట్రయర్‌ కోర్టు విచారణ జరిపింది. ఆయన్ని దోషిగా తేల్చింది. 10 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును ఆయన సవాల్ చేస్తూ.. పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కమాండో అభ్యర్థను కోర్టు తోసిపుచ్చింది. ట్రయల్‌ కోర్టు విధించిన జైలు శిక్షను సమర్థించింది.  
ఇక చివరికీ ఆయన హైకోర్టు తీర్పును కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ దాఖలు చేశారు. '' నేను బ్లాక్ క్యాట్‌ కమాండోని. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో కూడా పాల్గొన్నాను. ఈ కేసులో నాకు మినహాయింపు కల్పించండని'' విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నాననే కారణాన్ని సాకుగా చూపి ఇంట్లో జరిగిన దారుణ ఘటన నుంచి మీరు రక్షణ పొందలేరని మండిపడింది. ఇది చాలా దారుణమైన ఘటనని.. ఇందులో మినహాయింపు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. దీనికి కొంత సమయం కావాలని పిటిషనర్‌ కోరగా.. రెండు వారాల పాటు గడువు ఇచ్చింది. 
Advertisment
తాజా కథనాలు