పాకిస్తాన్‌కు మరో షాక్ ఇవ్వడానికి భారత్ రెడీ అయిపోతుంది. పాకిస్తాన్‌లోని న్యూక్లియర్ వెపన్స్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది భారత్. ఈ మేరకు IAEAకు విజ్ఞప్తి చేశారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పాకిస్తాన్ ఓ పనికి మాలిన దేశమన్న రాజ్‌నాథ్‌సింగ్.. అలాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండటం సేఫ్ కాదన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పర్యవేక్షణలో ఉంచాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని బాదామి బాగ్ కంటోన్మెంట్‌లో సైనిక సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన అన్నారు. అణ్వాయుధాల పేరుతో పాకిస్తాన్ బెదిరిస్తోందని పేర్కొన్నారు. వాళ్ల చేతుల్లో అణ్వాయుధాలు సురక్షితంగానే ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. IAEA అనేది ఒక ప్రపంచ అణు నిఘా సంస్థ.
ऑपरेशन सिंदूर आतंकवाद के ख़िलाफ़ भारत द्वारा चलाई गई, अब तक के इतिहास की सबसे बड़ी कार्रवाई है। पैंतीस-चालीस वर्षों से भारत सरहद पार से चलाये जा रही आतंकवाद का सामना कर रहा है। आज भारत ने पूरी दुनिया के सामने स्पष्ट कर दिया है कि आतंकवाद के ख़िलाफ़ हम किसी भी हद तक जा सकते हैं।… pic.twitter.com/QjDHAkLouX
— Rajnath Singh (@rajnathsingh) May 15, 2025
Also read : Jai Shankar: పాక్ ఆరోపణలను ఖండించిన ఆఫ్ఘాన్..థాంక్స్ చెప్పిన జైశంకర్
Also Read : USA: ట్రంప్ మాటను లెక్కని చేయని యాపిల్..భారత్ లో ప్లాంట్
పాకిస్తాన్‌లో రేడియేషన్ లీక్
భారత్ ఎప్పుడూ యుద్ధానికి మద్దతు ఇవ్వలేదు కానీ మన దేశంపై దాడి జరిగినప్పుడు మాత్రం కచ్చితంగా ప్రతిస్పందిస్తామని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న అతిపెద్ద చర్య అని రాజ్‌నాథ్ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్చ ఉగ్రవాదులపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన జమ్మూ కశ్మీర్ ప్రజలను కూడా ఆయన ప్రశంసించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్మీ చీఫ్ ఇతర ఉన్నతాధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు. మరోవైపు ఇప్పటికే పాకిస్తాన్‌లో రేడియేషన్ లీక్ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కిరానా హిల్స్‌పై భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది.
Also read : AP NEWS : బస్సు కండక్టర్‌పై దాడి చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు!
Also read : Neeraj Chopra: అర్షద్ నదీమ్ నా ఫ్రెండ్ కాదు.. పాక్‌తో యుద్ధంవేళ నీరజ్ సంచలనం!
rajnath-singh | india operation sindoor