Jai Shankar: పాక్ ఆరోపణలను ఖండించిన ఆఫ్ఘాన్..థాంక్స్ చెప్పిన జైశంకర్

తమపై దాడి చేసేందుకు భారత్ ఆఫ్ఘాన్ భూభాగాన్ని వాడుకుందని పాక్ ఆరోపించింది. వీటిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. దీనికి సంబంధించి ఆఫ్ఘాన్ మంత్రి మవ్లావి అమిర్ తో మాట్లాడానని విదేశాంగమంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. 

author-image
By Manogna alamuru
New Update
Jai shankar

భారత్ లో ఉగ్రదాడులను మొదటి నుంచి ఆప్ఘాన్ ఖండిస్తూనే ఉంది. యుద్ధ సమయంలో కూడా తాలిబాన్లు భారత్ వైపే ఉన్నారు. అయితే అప్పటి నుంచి ఆఫ్ఘాన్, భారత్ ల మీద ఏవో ఒక ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా తమపై దాడులు చేసేందుకు భారత్...ఆఫ్ఘాన్ భూభాగాన్ని వాడుకుందని పాక్ ఆరోపణలు చేసింది. వీటిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. భారత్ తమ భూభాగాన్ని వాడుకోలేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆఫ్ఘాన్ మంత్రి మవ్లావి అమిర్ తో మాట్లాడానని విదేశాంగమంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.  భారత్, ఆఫ్ఘాన్ ల మధ్య విభేదాలు సృష్టించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని...వాటిని ఖండించింనందుకు ధన్యవాదాలు అంటూ జైశంకర్ ట్వీట్ లో రాశారు. ఆఫ్ఘాన్ ప్రజలతో మా స్నేహం కొనసాగుతుంది చెప్పారు. అక్కడి అభివృద్ధికి ఎప్పుడూ మద్దతిస్తామని అన్నారు. 

 today-latest-news-in-telugu | jai-shankar | pakistan | afghanistan

Advertisment
Advertisment
తాజా కథనాలు