/rtv/media/media_files/2025/04/27/e7qqG3Qw8RHzVuBonUK9.jpg)
Pakistani Nationals Failing To Leave India Face 3 Years Jail Term
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.
Also Read: బ్యాగ్‌లో బాంబ్- విమానంలో ‘అల్లా హు అక్బర్’ అంటూ భయపెట్టిన వ్యక్తి!
సార్క్ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 అమల్లోకి వచ్చింది.
Also Read: 'ఇలా చేయడం కరెక్ట్ కాదు'.. కేంద్రాన్ని హెచ్చరించిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం..
దీనిప్రకారం గడువు అయిపోయినా కూడా భారత్‌లో ఉంటే.. వీసా రూల్స్‌ను ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలకు వెళ్లడం లాంటి సందర్భాల్లో మూడేళ్ల వరకు జైలుశిక్ష, అలాగే రూ.3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. మరోవైపు పాకిస్థానీయులను గుర్తించి వాళ్లని వెనక్కి పంపించే దిశగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే.. పాకిస్థాన్ జాతీయులు అటారీ-వాఘా బార్డర్ గుండా తరలివెళ్లారు. 3 రోజుల్లోనే ఈ సరిహద్దు గుండా దేశం దాటి వెళ్లిపోయారు. ఇక పాకిస్థాన్‌లో ఉన్న 745 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.
Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్ చేసిన వీడియోగ్రాఫర్.. కానీ
telugu-news | rtv-news | Pahalgam attack | pakistan | national-news