Pak Missile: దాల్‌ సరస్సులో పాక్‌ క్షిపణి శిథిలాలు..ఎప్పటిదో తెలిస్తే షాక్!

పాకిస్తాన్‌కు చెందిన ఓ క్షిపణి శిథిలాలు జమ్మూ కాశ్మీర్‌లోని దాల్ సరస్సులో గుర్తించారు. ఆదివారం ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా పాకిస్తాన్ భారత్‌పై ప్రయోగించిన క్షిపణి అని తెలుస్తోంది.

New Update
pak missel

పాకిస్తాన్‌(pakistan) కు చెందిన ఓ క్షిపణి(missile) శిథిలాలు జమ్మూ కాశ్మీర్‌లోని దాల్ సరస్సు(Dal Lake) లో గుర్తించారు. ఆదివారం ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా పాకిస్తాన్ భారత్‌పై ప్రయోగించిన క్షిపణి అని తెలుస్తోంది. ఎప్పటిలాగే దాల్ సరస్సు శుభ్రం చేస్తుండగా క్షిపణి శిధిలాలు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికులలో భయాందోళనలను పెంచింది.

Also Read :  మీరు మాట్లాడండి, మేము గెలుస్తాం.. ట్వీట్లతో పాక్ పరువు తీసిన ఇండియన్ ఓపెనర్లు!

Pakistani Missile In Dal Lake

మే నెలలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ "ఆపరేషన్ సింధూర్"ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సమయంలోనే పాకిస్తాన్ వైపు నుంచి క్షిపణి దాడులు జరిగాయి. ఆ సమయంలో శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని, దాల్ సరస్సు నుంచి పొగలు వెలువడ్డాయని అధికారులు తెలిపారు. సరస్సులో పడిన క్షిపణి శిథిలాలను అప్పట్లో భద్రతా బలగాలు వెలికితీశాయి. అయితే, తాజాగా క్లీనింగ్ డ్రైవ్‌లో మరోసారి క్షిపణి అవశేషాలు బయటపడడ్డాయి.

స్థానికంగా ఉన్న లేక్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (LCMA) సిబ్బందికి శనివారం ఈ శిథిలాలు దొరికాయి. వెంటనే వారు వీటిని సమీప పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. క్షిపణిలో యాక్టీవ్ మిస్సేల్ భాగాలు ఉన్నాయని, వాటిని డిస్మాటిల్ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. క్షిపణిలోని ఓ భాగాన్ని వైమానిక దళానికి అప్పగించినట్లు పేర్కొన్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ క్షిపణి పేలి ఉంటే శ్రీనగర్‌లోని ప్రధాన పర్యాటక కేంద్రమైన దాల్ సరస్సులో భారీ విపత్తు సంభవించి ఉండేది. ఈ ఘటన తీవ్రతను గుర్తించిన అధికారులు, ఈ శిథిలాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను మరోసారి గుర్తు చేసింది. దేశ భద్రతకు ఇలాంటి ఘటనలు పెను సవాలుగా నిలుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read :  వాటే ఇన్నింగ్స్.. యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ

Advertisment
తాజా కథనాలు