Ind-Pak: కాల్పులు కొనసాగిస్తున్న పాకిస్తాన్..ఎల్వోసీ దగ్గర ఉద్రిక్తత

భారత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులను కొనసాగిస్తూనే ఉంది. వాటిని భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. నిన్న అర్ధరాత్రి జమ్మూ, కాశ్మీర్ లోని కుప్వారా, అఖ్నూర్ దగ్గర ఫైరింగ్ చేసింది పాక్. 

author-image
By Manogna alamuru
New Update

పహల్గామ్ దాడి జరిగి ఇప్పటికి దాదాపు వారం రోజులు గడిచింది. అప్పటి నుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్డుతూనే ఉంది. ప్రతీరోజు బార్డర్ లో ఎక్కడో ఓ చోట కాల్పులును నిర్వహిస్తూనే ఉంది. ఒక పక్క యుద్ధం వద్దంటూ పాక్ ప్రధాని నంగనాచి కబుర్లు చెబుతున్నారు. మరోవైపు వాళ్ళ ఆర్మీ మాత్రం కాల్పులు ఒప్పందాన్ని పక్కన పెట్టి మరీ దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నిన్న రాత్రి కూడా బార్డర్ దగ్గర ఫైరింగ్ చేసింది పాకిస్తాన్. కుప్వారా, అఖ్నూర్ ఎల్వోసి వెంబడి కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. అయితే భారత్ ఈ కాల్పులను సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. 

యుద్ధం జరిగే అవకాశాలు..

మరోవైపు భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. ఇప్పటికే కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న దాదాపు 200 మంది ఉగ్రవాదులను ఖతం చేశారని తెలుస్తోంది. లాగే భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ పై చర్యలు తీసుకుంటోంది. నిన్న పాక్ విమానాలను భారత్ లోకి అనుమతించకుండా ఆదేశాలను జారీ చేసింది. అంతకు ముందు సింధు జలాలు మరికొన్ని నిర్ణయాలతో పాక్ పై దౌత్యపరంగా దాడి చేసింది. అలాగే పాకిస్తాన్ పై దాడి విషయంలో ప్రధాని మోదీ భారత త్రివిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. వాళ్ళేం చేసినా ప్రభుత్వానికి ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఊపేశారు.ద దీంతో ఇవాళో , రేపూ యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 today-latest-news-in-telugu | india | loc | firing

Also Read: Pakistan: అయెధ్య లో బాబ్రీ మసీదు..రెచ్చిపోయి ప్రగల్భాలు పలికిన పాక్ సెనెటర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు