Pakistan: అయెధ్య లో బాబ్రీ మసీదు..రెచ్చిపోయి ప్రగల్భాలు పలికిన పాక్ సెనెటర్

యుద్ధం ఆపించండి అంటూ పాక్ ప్రధాని షెహబాజ్ అందరి కాళ్ళూ పట్టుకుంటున్నారు. కానీ ఆయన కింద మంత్రులు, ఇతర నేతలు మాత్రం నోటికి వచ్చింది మాట్లాడుతూ గొడవలకు దిగుతున్నారు. తాజాగా అయెధ్యలో బాబ్రీ మసీదు కడతాం అంటూ పాక్ సెనెటర్ ప్రగల్భాలు పలికారు. 

New Update

పాకిస్తాన్ సెనెటర్ పాల్వాషా ఖాన్ తను దుర్భుద్ధిని బయటపెట్టారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. అసలే ఒకవైపు రెండు దేశాల మధ్యనా ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించవలసింది పోయి పాక్ నేతలు తమ వక్ర బుద్ధిని బయటపెట్టుకుంటున్నారు. అనవసరమైన ప్రేలాపనలు పేలుతూ లేని పోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. 

కావాలని రెచ్చగొడుతున్నారు..

అమోధ్యలో బాబ్రీ మసీదు కట్టడానికి పునాది రాయి వేస్తుందంటూ పాక్ సెనెటర్ పాల్వాషా ఖాన్ ప్రేలాపన పేలారు. అక్కడి నుంచి పాక్ ఆర్మీ ఛీఫ్ తొలి ఆజాన్ ఇస్తారంటూ తన దుర్భుద్ధిని బయటపెట్టుకున్నారు. అంతే కాదు యుద్ధం గురించి మాట్లాడుతూ తామేమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదని..భారత్ కు తగిన జవాబు ఇస్తామని పాల్వాషా కయ్యానికి కాలు దువ్వారు. భారత సిక్కు ఆర్మీ పాక్ పై దాడి చేయదని చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్ వారు మతగురువు గురు నానక్ జన్మించిన ప్రదేశమని చెప్పుకొచ్చారు. 

నిన్న పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున ఎవరూ అంత సులభంగా దానిపై దాడి చేయలేరని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, అధికార పిఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ కుమార్తె  అయిన మరియం ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ, “ఈరోజు భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. కానీ అల్లాహ్ పాకిస్తాన్ సైన్యానికి దేశాన్ని రక్షించే శక్తిని ఇచ్చాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు” అని అన్నారు. 

today-latest-news-in-telugu | pakistan | india | babri-masjeed | Pahalgam attack 

Also Read: Vande Bharat: వందే భారత్ రైలులో పురుగుల సాంబార్..ప్రయాణికుల ఆందోళన

Advertisment
తాజా కథనాలు