Pakistan: వరదలో పాకిస్తాన్‌కు కొట్టుకుపోయిన భారతీయులు.. ఏడాది శిక్ష తర్వాత రిలీజ్

పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ దళాలకు చిక్కిన ఏడుగురు భారతీయులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఏడాది కాలంగా వారు పాక్ జైళ్లల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. శనివారం పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు వీరిని BSF అప్పగించారు.

New Update
Pakistan releases

పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ దళాలకు చిక్కిన ఏడుగురు భారతీయులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఏడాది కాలంగా వారు పాక్ జైళ్లల్లో(Pakistan jail) నరకయాతన అనుభవిస్తున్నారు. శనివారం పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు వీరిని సరిహద్దు భద్రతా దళానికి (BSF) అప్పగించారు. భారత దౌత్య వర్గాల నిరంతర కృషితో ఈ విడుదల సాధ్యమైంది.

2023లో కురిసిన భారీ వర్షాల వల్ల పంజాబ్ సరిహద్దుల్లో ఉధృతంగా ప్రవహించిన వరద నీరు వీరి జీవితాలను తలకిందులు చేసింది. పశువులను, తమ వ్యవసాయ పరికరాలను రక్షించుకునే క్రమంలో వీరంతా బలమైన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి పాక్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. విడుదలైన వారిలో నలుగురు ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందినవారు కాగా, మిగిలిన వారు జలంధర్, లూథియానా, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. తిరిగి వచ్చిన వారు పాక్ జైళ్లలో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read :  కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కేవి ఇవే.. పూర్తి వివరాలు

Pakistan Releases Indians Stranded In Floods

చిత్రహింసలు: "మమ్మల్ని పాక్ సైన్యం పట్టుకున్నాక కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. పొరపాటున వచ్చామని వేడుకున్నా వినలేదు. ఒక గదిలో బంధించి దారుణంగా కొట్టేవారు" అని ఒక బాధితుడు వాపోయాడు. పాక్ జైళ్లలో పరిస్థితి దారుణంగా ఉందని, అక్కడ ఇంకా చాలా మంది భారతీయులు ఉన్నారని బాధితులు తెలిపారు. సుమారు 18 మంది భారతీయులు అక్కడ మానసిక స్థితి తప్పి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వారు వెల్లడించారు. వరదలో కొట్టుకుపోయిన వారికి కూడా పాక్ కోర్టులు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించడం గమనార్హం.

ఒక బాధితుడు మాట్లాడుతూ.. "నేను నా ట్రాక్టర్‌ను కాపాడుకోవడానికి వెళ్లి వరదలో కొట్టుకుపోయాను. గ్రామస్తులు సహాయం చేస్తారనుకుంటే సైన్యానికి అప్పగించారు. ఏడాది తర్వాత మళ్లీ ఇండియాకు వస్తానని అనుకోలేదు" అని ఆనందం వ్యక్తం చేశాడు. తమ్మల్ని క్షేమంగా తిరిగి రప్పించినందుకు భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన భారతీయులను కూడా త్వరగా రప్పించాలని విజ్ఞప్తి చేశారు. అట్టారి సరిహద్దు వద్ద కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి అధికారులు వీరిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సరిహద్దు ప్రాంతాల్లో వరదల సమయంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read :  BUDGET 2026: బడ్జెట్లో నిర్మలమ్మ ఏం చెప్పింది.. స్టాక్ మార్కెట్ క్రాష్‌కు కారణం అదేనా?

Advertisment
తాజా కథనాలు