/rtv/media/media_files/2026/02/01/what-are-the-advantages-to-telugu-states-in-union-budget-2026-2026-02-01-17-46-21.jpg)
What are the advantages to telugu states in union budget 2026
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చేలా కొన్ని ప్రకటనలు చేశారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కేంద్ర బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రతిపాదించారు. వీటిలో మూడు కారిడర్లు హైదరాబాద్ మీదుగానే వెళ్లనున్నాయి. పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై కారిడార్ల గురించి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇందులో రెండు కారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగానే వెళ్లనున్నాయి.
కొబ్బరి రైతుల కోసం కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ ప్రవేశపెడుతున్నామని నిర్మలా సీతారమన్ ప్రకటించారు. ఉత్పాదకత ఇవ్వని కొబ్బరి చెట్లను తీసివేసి వీటి స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు ఈ స్కీమ్ దోహపడుతుంది. ఏపీలోని కోనసీమతో సహా పలు ప్రాంతాల్లో కొబ్బరి చెట్లపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, కూలీలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అలాగే బడ్జెట్‌లో 2026-27లో కోకో, జీడిపప్పు సాగు చేసే రైతుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.
ప్రస్తుతం ఏపీలోని కోస్తా, ఏజెన్సీ ప్రాంతాల్లో కోకో, జీడిపప్పును ఎక్కువగా సాగు చేస్తున్నారు. అంతేకాదు కోకో ఎగుమతుల్లో ఏపీయే అగ్రస్థానంలో ఉంది. జాతీయ కోకో మిషన్ ద్వారా కోకో సాగు విస్తీర్ణం మరింత పెంచనున్నారు. అలాగ పాత తోటలు పునరుద్ధరించేందుకు, కొత్త మొక్కలు పంపిణీ కోసం 40 శాతం సబ్సిడీని ఇవ్వనున్నారు. మరోవైపు విదేశాల నుంచి వచ్చే ప్రాసెస్డ్ జీడిప్పుపై దిగుమతి సుంకాన్ని పెంచారు. దీంతో స్థానిక రైతులు సాగు చేసే జడిపప్పుకే డిమాండ్ ఉంటుంది. ఉత్తరాంధ్రలో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లను ఆధునికీకరించడం కోసం MSME క్లస్టర్ అభివృద్ధి పథకం కింద నిధులు కేటాయించారు.
Also Read: బడ్జెట్‌పై విపక్షాల మండిపాటు.. ఎవరేమన్నారంటే?
ఇదిలాఉండగా డేటా సెంటర్లకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2047 వరకు ఇవి పన్నులు చెల్లించాల్సి అవసరం లేదని చెప్పింది. విశాఖతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. కేంద్రం చేసిన ఈ ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో మరిన్న డేటా సెంటర్లు రానున్నాయి. కానీ ఈ సౌకర్యం పొందేందుకు కంపెనీలు స్థానిక రీసెల్లర్ల ద్వారా భారత కస్టమర్లకు సేవలు అందించాలనే షరతు పెట్టింది.
మరోవైపు రేర్ ఎర్త్ మినరల్స్‌కు సంబంధించి కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ, ఒడిశా, తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల ఏపీలో పరిశ్రమలు అభివృద్ధి అయ్యే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే పర్మనెంట్ మ్యాగ్నెట్లు ఏపీలోనే తయారైతే ఇక ఏపీ ఈవీ తయారీ హబ్‌గా నిలుస్తుంది.
చిన్న పట్టణాల అభివృద్ధిపై కూడా కేంద్రం ఫోకస్ పెట్టింది. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు, నగరాల అభివృద్ధికి నిధులు కేటాయించనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు,తదితర నగరాలకు ప్రత్యేక గ్రాంట్లు అందించనున్నారు. టెంపుల్ సిటీలను కూడా అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 20 కొత్త జలమార్గాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో కాకినాడ-పుదుచ్చేరి కెనాల్, విజయవాడ-ముక్త్యాల, భద్రాచలం-రాజమండ్రి మార్గాలు ఉండనున్నాయి.
Also Read: బడ్జెట్లో నిర్మలమ్మ ఏం చెప్పింది.. స్టాక్ మార్కెట్ క్రాష్‌కు కారణం అదేనా?
రోయ్యల సాగుపై కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. రొయ్యల మేత తయారీ కోసం అవసరమయ్యే ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు. అలాగే ఏపీలోని తీర ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను ఏర్పాటు చేయనున్నారు. రొయ్యలకు సోకే వ్యాధులను గుర్తించడం కోసం కేంద్రం నిధులతో ఏపీలో మరిన్ని ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 500 ప్రధాన రిజర్వాయర్లు, అమృత సరోవర్లలో చేపలు పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేజ్ కల్చర్, సీడ్ స్టాకింగ్ బ్రూడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఏపీ, తెలంగాణలోని జలాశయాల్లో చేపల పెంపకం కోసం ప్రయోజనం జరగనుంది.
Follow Us