/rtv/media/media_files/2025/05/02/32yMkIP4Qh2XWul714zd.jpg)
Heavy Security to Hafiz Saeed
Heavy Security to Hafiz Saeed : పహల్గాంలో పర్యాటకులపై జరిపిన పాశవిక దాడి వెనక లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. దాడి వెనుక భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ భారీ భద్రత కల్పిస్తోంది. పహెల్గాం ఉగ్రదాడికి పాల్పడింది లష్కరేకు చెందిన ఉగ్రవాదులే. పహెల్గాం దాడి తర్వాత భారత్ టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీజ్ సయీద్ ఉన్నాడని తెలిసిన పాకిస్తాన్ ప్రభుత్వం. ఐఎస్ఐ అతనికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం.
Also Read: Life Style: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
పాక్ సెక్యూరిటీ భద్రత..
హఫీజ్ సయీద్ భద్రతను నాలుగు రెట్లు పెంచిన పాక్ ప్రభుత్వం.. హఫీజ్ నివాసానికి 4 కి.మీ. మేర హై రిజెల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది.అతడు పాక్‌లో ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ ఆంగ్ల మీడియా తమ కథనంలో వెల్లడించింది. హఫీజ్ దర్జాగా తన నివాసం నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. గత నెలలో హఫీజ్ సన్నిహితుడు అబూ ఖతల్ హత్య తర్వాత పాక్ హఫీజ్ సయీద్‌కు భద్రతను కట్టుదిట్టం చేసింది. పహెల్గాం దాడి నేపథ్యంలో భద్రతను మరింత పెంచినట్లు తెలుస్తోంది.
బహిరంగంగానే తిరుగుతూ
సాధారణంగా ఉగ్ర నాయకులు ఎవరికీ తెలియని రహస్య ప్రదేశాల్లో దాక్కుంటారు. కానీ, హఫీజ్ సయీద్ మాత్రం బహిరంగంగానే తిరుగతున్నాడు. అతడు లాహోర్‌లోని జోరమ్ తౌమ్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో సామాన్యపౌరులతో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. హఫీజ్ నివాసం వద్ద పాక్ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భవనంలో హఫీజ్ తన కుటుంబంతో పాటు నివసిస్తున్నారట. ఇంటిముందు ఓ ప్రైవేటు పార్క్, పక్కనే మసీదు, మదర్సా కూడా ఉన్నట్లు సమాచారం. భవనం కింద ఓ బంకర్ కూడా ఉందని సదరు కథనం పేర్కొంది.
జైల్లో ఉన్నాడని బుకాయింపు
కానీ, ఆ దేశ ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతూనే ఉంది. ఉగ్ర సంస్థకు నిధులు సమకూర్చిన కేసులో అతడికి 31 ఏళ్ల జైలు శిక్ష పడిందని, అతడు జైల్లోనే ఉన్నాడని బుకాయిస్తోంది. 2019లో హఫీజ్ అరెస్టయినట్లు కథనాలు వచ్చాయి. ఆ మధ్య హఫీజ్ అనుచరులు, లష్కరే ఉగ్రవాదుల వరుస హత్యలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పరిణామాలతో అతడికి పాకిస్థాన్ భద్రత పెంచినట్లు తెలుస్తోంది. అతడి ఇంటినే సబ్‌జైలుగా మార్చినట్లు వార్తలు వినిపించాయి.
Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‌లో టెన్షన్ టెన్షన్..!
2008 నవంబరు 26న దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పాటు మరెన్నో ఉగ్ర దాడుల్లో హఫీజ్ సయీద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్‌ను.. ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది.
హఫీజ్‌ను లేపేస్తాం..లారెన్స్ బిష్ణోయ్
ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ను లేపేస్తాం అంటూ గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్చల్ చేస్తోంది. 'అతడి తలపైన కోట్ల రూపాయలు రివార్డ్ వుందని మాకు తెలుసు కానీ అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం లక్ష రూపాయలే.హఫీజ్ సయీద్ మా దేశంలోని అమాయక పౌరులను హతమార్చాడు. ఇక అతడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు' అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. హఫీజ్ సయీద్ ఫోటోపైన రెడ్ ఇంకుతో ఎక్స్ మార్కు పెట్టారు. బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది. ఐతే ప్రస్తుతానికి ఈ గ్యాంగ్ లీడర్ బిష్ణోయ్ జైల్లో వున్నాడు. కానీ ఇతడి అనుచరులు మాత్రం బైటే వున్నారు. ఈ గ్యాంగుకి చెందిన వారు పాకిస్తాన్ దేశంలోకి ప్రవేశిస్తారనీ, హఫీజ్ సయీద్ ను తప్పకుండా మట్టుబెడతారంటూ ఆ పోస్టులో వెల్లడించారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?