Sofiya Qureshi: కవ్వింపు చర్యలకు దిగి పాక్‌ తీవ్రంగా నష్టపోయింది : సోఫియా ఖురేషి

పాకిస్తాన్ చేసిన అన్ని ప్రచారాలు అబద్ధమని, భారత ఆర్మీ సీనియర్ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.  భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత  ఆమె మీడియాతో మాట్లాడారు. పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. 

New Update
Sofiya Qureshi

Sofiya Qureshi

Sofiya Qureshi: పాకిస్తాన్(Pakistan) చేసిన అన్ని ప్రచారాలు అబద్ధమని, భారత ఆర్మీ(Indian Army) సీనియర్ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి శనివారం తెలిపారు.  భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ(India-Pakistan Ceasefire) ప్రకటించిన తరువాత  ఆమె మీడియాతో మాట్లాడారు.  భారత్ అధునాతన వాయు రక్షణ వ్యవస్థ S-400పై దాడి(War) చేసినట్లు పాకిస్తాన్ చెప్పిందని, ఇది పూర్తిగా తప్పు అని ఆమె అన్నారు. S-400 కి ఎటువంటి నష్టం జరగలేదని, పాకిస్తాన్ క్షిపణులు వాటి లక్ష్యాలను చేరుకోలేదని కల్నల్ ఖురేషి స్పష్టం చేశారు. ప్రతీకార చర్యగా భారత్ పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం కలిగించిందని, అనేక సైనిక స్థావరాలను ధ్వంసం చేసిందని వెల్లడించారు. 

 Also Read: BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్

 Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

కవ్వింపు చర్యలకు దిగి పాక్‌ నష్టపోయింది

భారత్ పై కవ్వింపు చర్యలకు దిగి పాక్‌ తీవ్రంగా నష్టపోయిందని సోఫియా ఖురేషి  తెలిపారు. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను  ధ్వంసం చేశామని తెలిపారు.  పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.  బ్రహ్మోస్ స్థావరానికి పాకిస్తాన్ వల్ల నష్టం జరిగిందనే వార్తలు పూర్తిగా అవాస్తవమని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ అన్నారు. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను భారత్ నాశనం చేసిందని తెలిపారు. భారత సైన్యం భద్రత కల్పించగల సామర్థ్యం కలిగి ఉంది. తాము ఏ మతపరమైన స్థలాన్ని ధ్వంసం చేయలేదని తెలిపారు.  

Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు