/rtv/media/media_files/2025/10/04/2-indian-tourists-jailed-for-robbing-sex-workers-in-singapore-hotels-2025-10-04-16-49-25.jpg)
2 Indian Tourists Jailed For Robbing Sex Workers In Singapore Hotels
సింగపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భారతీయ టూరిస్టులు మరో ఇద్దరు సెక్స్ వర్కర్లను బుక్ చేసుకుని హోటల్ గదులకు పిలిపించుకుని వాళ్లని దోపిడి చేయడం కలకలం రేపింది. దీంతో పోలీసులు వాళ్లని అదుపులోకి తీసుకున్నారు. చివరికి అక్కడి కోర్టు నిందితులకు 5 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బలు కూడా విధించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. అరోక్కియాసామి డైసన్ (23), రాజేంద్రన్ మాయిలారసన్ (27) అనే ఇద్దరు వ్యక్తులు విహారయాత్ర కోసం ఈ ఏడాది ఏప్రిల్ 24న సింగపూర్‌కు వచ్చారు.
Also Read: నీరవ్ మోదీకి బిగ్ షాక్.. మరికొన్ని రోజుల్లోనే భారత్‌కు అప్పగింత
రెండ్రోజుల తర్వాత వాళ్లని ఓ గుర్తుతెలియని వ్యక్తి కలిసి సెక్స్ వర్కర్ల సమాచారం ఇచ్చి వెళ్లాడు. దీంతో అరోక్కియా, రాజేంద్రన్ ఇద్దరు సెక్స్ వర్కర్లకు ఫోన్ చేశారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ఓ హోటల్ రూమ్‌కు రావాలని ఓ ప్రాస్టిట్యూట్‌కు చెప్పారు. ఆమె గది లోపలికి రాగానే వాళ్లిద్దరూ కలిసి ఆమె కాళ్లు, చేతులు కట్టేశారు. ఆమె వద్ద ఉన్న నగలు, 2000 సింగపూర్ డాలర్లు, ఆమె పాస్‌పోర్టు, బ్యాంకు కార్డులను దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు.
Also Read: దేశం విడిచి వెళ్లిపోతే భారీగా డబ్బులు.. వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్
అదే రోజు రాత్రి 11 గంటలకు మరో సెక్స్ వర్కర్‌ను మరో హోట్‌ల్ గదికి పిలిపించారు. ఆమె గదిలోకి రాగానే లోపలికి లాక్కెళ్లి అరవకుండా ఉండేందుకు నోటికి ప్లాస్టర్ వేశారు. తన వద్ద ఉన్న 800 సింగపూర్ డాలర్లు, రెండు మొబైల్ ఫోన్లు, తన పాస్‌పార్టును దోచుకున్నారు. తాము మళ్లీ వచ్చేవరకు రూమ్ నుంచి బయటకు వెళ్లొద్దంటూ హెచ్చరించారు. ఆ తర్వాతి రోజు రెండో బాధితురాలు తనకు జరిగిన విషయాన్ని మరో వ్యక్తికి చెప్పడంతో పోలీసుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాళ్లిద్దరినీ అదుపులోకీ తీసుకున్నారు.
Also Read: అమెరికాకు నో చెబుతున్న భారత విద్యార్థులు..జూలై-ఆగస్టులో 50శాతం తగ్గుదల
అయితే విచారణలో అరోక్కియాసామీ తన బాధలను చెప్పుకున్నాడు. గతేడాది తన తండ్రి మరణించారని.. తనకు ముగ్గరు సోదరీమణులు ఉన్నారని వాళ్లలో ఒకరికి పెళ్లి జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర డబ్బులు లేవని అందుకే ఈ పని చేశానంటూ తెలిపారు. ఇక రాజేంద్రన్ మాట్లాడుతూ తన భార్య, బిడ్డ ఇండియాలో ఒంటరిగా ఉంటున్నారని.. ప్రస్తుతం వాళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు.