/rtv/media/media_files/2025/04/24/Bx5WM4vIrnX8xa9QIZuG.jpg)
Pahalgam Terror Attack narwal
జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రదాడిలో 28 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఉన్నారు. అయితే వినయ్ ఉగ్రదాడిలో మృతి చెందక ముందు అతడు తన భార్యతో గడిపిన వీడియో ఇదేనంటూ నెట్టింట ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.
అందులో వినయ్ నర్వాల్, తన భార్య హిమాన్షితో డ్యాన్స్ చేస్తున్న 19 సెకన్ల క్లిప్ ఒకటి వైరల్ అయింది. న్యూస్ పేపర్, సోషల్ మీడియా, టీవీల్లో అంతా ఇదే వీడియో స్ప్రెడ్ అయింది. అది చూసి ప్రజలంతా అయ్యో అంటూ ఆవేదన చెందారు. అయితే ఇప్పుడు అందులో ఉన్నది వినయ్ నర్వాల్, తన భార్య హిమాన్షి కాదని తెలిసింది. అందులో ఉన్నది మేమేనంటూ ఆశిష్ షెహ్రావత్, యషిక శర్మ జంట ఒక షాకింగ్ వీడియో రిలీజ్ చేసారు.
Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ
ఆ వీడియోలో ఉన్నది మేమే
ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. తాము బతికే ఉన్నామని.. ఆ వీడియోలో ఉన్నది తామేనంటూ ఆశిష్, యాషిక తెలిపారు. ఆశిష్ షెహ్రావత్ భారత రైల్వేలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే యషిక శర్మతో కలిసి ఏప్రిల్ 14న డ్యాన్స్ చేసిన వీడియో అది. ఆ వీడియోను ఏప్రిల్ 22న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సరిగ్గా అదే రోజున బైసరన్ వ్యాలీలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చిన విషయం తెలిసిందే.
Also Read: ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
దీంతో ఈ జంట పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియోపై ఘోరమైన విమర్శలు, ట్రోలింగ్స్ వచ్చాయి. ఆ ప్రాంతంలో రక్తపాతం జరిగితే.. ఇలా ఎంజాయ్ చేసిన వీడియోలు పోస్టు చేయడం ఏంటని నెటిజన్లు రకరకాలుగా విరుచుకుపడ్డారు. దీంతో ఆశిష్ షెహ్రావత్ ఆ వీడియోను డిలీట్ చేశాడు.
Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
అయితే అదే వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేసి అందులో ఉన్నది వినయ్ నర్వాల్, హిమాన్షి అని స్ప్రెడ్ చేస్తుండటంతో.. దానిపై ఈ జంట స్పష్టతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. తాము బతికే ఉన్నామని తెలిపింది. ఆ వీడియోలో ఉన్నది.. వినయ్ నర్వాల్, హిమాన్షి కాదని..అందులో ఉన్నది తామేనని ఆశిష్ షెహ్రావత్, యషిక శర్మ క్లారిటీ ఇచ్చారు.
pahalgam terror attack | Lieutenant Vinay Narwal | latest-telugu-news | telugu-news