/rtv/media/media_files/2025/04/26/kPQLw6DRUy8zUADcSj3r.jpg)
Pahalgam Terror Attack
మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన హింసకాండ జరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా బైరసన్ వ్యాలీలో ఉన్న అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై టెర్రరిస్టులు ఉగ్రదాడికి పాల్పడ్డారు. దాదాపు 26 మందిని అతి దారుణంగా, కిరాతంగా హతమార్చారు. కేవలం హిందూ పురుషులనే టార్గెట్‌గా పెట్టుకున్న ఉగ్రవాదులు.. పేరు, మతం అడిగి మరీ చంపేశారు.
Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమాయకుల తలలే లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపుతోన్న మరొక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!
షాకింగ్ వీడియో
అందులో ఓ ఉగ్రవాది ఒక అమాయకుడ్ని నిలబెట్టి స్పాట్‌లో కాల్చేసినట్లు కనిపిస్తుంది. అయితే అది జరుగుతున్న సమయంలో చుట్టూ చాలా మంది ఉన్నారు. ఒక్కసారిగా వారు షాక్ అయినట్లు ఆ వీడియోలో చూడవచ్చు. ఆ సమయంలో పిల్లలు, ఆడ, మగ అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఉగ్రవాదులు దుశ్చర్యతో అంతా ఆశ్చర్యపోయి.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Breaking 🚨 Bharat 🇮🇳 Jammu Kashmir
— Islamist Cannibal (@Raviagrawal300) April 26, 2025
Pahalgam The latest video of Islamic terrorist attack
In this you can see that the Islamic terrorist is directly shooting bullets on the heads of Hindus. pic.twitter.com/crnHzDX2mE
Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం
దీంతో ఈ ఘటనపై మోదీ సర్కార్ సీరియస్ అయింది. అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీలు వెంటనే దేశం విడిచి వెళ్లాలని 48 గంటలు సమయం ఇచ్చింది. వీటితో పాటు సరిహద్దు వద్ద అటారీ ప్రాంతాన్ని క్లోజ్ చేసింది.
Also Read: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!
pahalgam terror attack live | pahalgam terror attack | latest-telugu-news | telugu-news