Heavy Smog: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమాన సర్వీసులకు ఆటంకం..

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారిపోయింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దాదాపు 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. మరోవైపు వయనాడ్ నుంచి ఢిల్లీకి వచ్చాక గ్యాస్ ఛాంబర్‌లోకి ప్రవేశించినట్లు ఉందని ప్రియాంక గాంధీ అన్నారు.

New Update
glu


దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారిపోయింది. అక్కడ దట్టమైన పొగమంచు అలముకుంది. వరుసగా రెండో రోజు కూడా వాయునాణ్యత సూచి 400 దాటింది. దీంతో సమీపంలోని దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. పొగమంచు ఎఫెక్ట్‌ విమానాలపై కూడా పడింది. దాదాపు 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఈ మేరకు ఫ్లైట్‌రాడర్ 24 సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీకి రావాల్సిన 115 విమానాలు, అక్కడి నుంచి బయలుదేరాల్సిన 226 సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది. 

Also Read: ప్రధాని మోదీకి మరో అరుదైన పురస్కారం.. ఏ దేశం ఇవ్వనుందంటే ?

మరోవైపు ఢిల్లీ కాలుష్యంపై మంత్రి గోపాల్‌రాయ్ స్పందించారు. '' ఈ సీజన్‌లో తొలిసారి రెండు రోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400లకు పైగా ఉంది. అక్టోబర్ 14 నుంచి 400 కన్నా తక్కువగా ఉన్న ఈ సూచి ఒక్కసారిగా ఎలా పెరిగింది అనే దానిపై అందరికీ సందేహాలు నెలకొన్నాయి. పర్వతాల వద్ద మంచు కురుస్తుండటం వల్ల ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. అందుకే ప్రస్తుతం నార్త్ ఇండియాలో పొడి వాతావరణం ఉంది. రేపటినుంచి కాలుష్య స్థాయిలు తగ్గే ఛాన్స్ ఉంది. 

Also Read :  ఆ డైరెక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగాడు.. షాకింగ్ విషయం బయటపెట్టిన 'విశ్వం' హీరోయిన్

 ఆ ప్లాన్ అమలు చేయట్లే

ఈ అంచనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ''గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(Grap)-3ని అమలు చేయడం లేదు. ఈ ప్లాన్ అమల్లోకి వస్తే అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుంది. అయిదవ తరగతి లోపు విద్యార్థులకు పాఠశాలలో సెలవులు ఉంటాయని'' మంత్రి అన్నారు. 

Also Read: మహారాష్ట్ర ఎన్నికలు.. స్కూటర్‌లో పట్టబడ్డ రూ.1.5 కోట్లు

గ్యాస్‌ ఛాంబర్‌లోకి వచ్చినట్లుంది

ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. కేరళలోని ఢిల్లీకి తిరిగివచ్చాక.. ఇక్కడ గ్యాస్ ఛాంబర్‌లోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తోందని అన్నారు. ఢిల్లీలో ఎప్పటికప్పుడు కాలుష్యం పెరుగుతూనే ఉందని.. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోస సమస్యలతో బాధడుతున్నవారికి ఇది కష్టమైన పరిస్థితని తెలిపారు. రాష్ట్రంలో పరిశుభ్రమైన గాలి కోసం అందరూ కలిసి పార్టీలను దాటి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

Also Read :  నడిరోడ్డుపై దారుణం.. తల్లీ కొడుకును నరికి చంపిన యువకుడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు