మహారాష్ట్ర ఎన్నికలు.. స్కూటర్‌లో పట్టుబడ్డ రూ.1.5 కోట్లు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో రోడ్‌పై వెళ్తున్న ఓ స్కూటర్‌ను పోలీసులు చెక్‌ చేయగా ఏకంగా రూ.1.5 కోట్లు పట్టుబడ్డాయి. ఈ నగదు ఎన్నికలకు సంబంధించిందేనా లేదా ఇతర అక్రమ కార్యకలాపాలదా అనేదానిపై పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

New Update
scooty

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మరోవైపు పోలీసులు కూడా బందోబస్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపారు. స్కూటర్‌లో చెక్‌ చేయగా ఏకంగా రూ.1.5 కోట్ల డబ్బును చూసి షాక్ అయ్యారు.  

Also Read: ప్రధాని మోదీకి మరో అరుదైన పురస్కారం.. ఏ దేశం ఇవ్వనుందంటే ?

ఈ భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే పట్టుబడ్డ ఆ రూ.1.5 కోట్ల నగదును ఏదైనా అక్రమ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారా లేదా ఎన్నికల్లో మనీలాండరింగ్‌కు సంబంధించిందా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. స్కూటర్‌పై వచ్చిన నిందితుడు యశోధర నగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడిని సెంట్రల్ అవెన్యూ ప్రాంతంలో పట్టుకున్నామని పేర్కొన్నారు.  

అయితే విచారణలో అతడి సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయని చెప్పారు. దీంతో తమకు అతనిపై మరింత అనుమానం పెరిగిందన్నారు. ప్రస్తుతం ఇంకా కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు ఆ డబ్బు ఏదో రాజకీయ పార్టీ నేతకు సంబంధించిందేనని అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. 

Also Read: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆరు భాషల్లో స్వామి చాట్‌బాట్

ఇదిలాఉండగా మహారాష్ట్రంలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజున పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఝార్ఖండ్‌తో పాటు మహారాష్ట్ర ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇటీవల హర్యానా, జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి ఝార్ఖండ్, మహారాష్ట్రలో ఎవరు అధికారంలోకి వస్తారో అనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు