PM Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన పురస్కారం.. ఏ దేశం ఇవ్వనుందంటే ? ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్‌లో ఉండే డొమినికా అనే ద్వీప దేశం ఆయనకు అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. కరోనా సమయంలో భారత్ అందించిన సహకారానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు పేర్కొంది. By B Aravind 14 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్‌లో ఉండే డొమినికా అనే ద్వీప దేశం ఆయనకు అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు డొమినికా ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కరోనా సమయంలో భారత్ అనేక దేశాలకు సాయం చేసింది. అందులో డొమినికా కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కరోనా సమయంలో భారత్ అందించిన సహకారానికి గుర్తుగా ఈ అత్యున్న జాతీయ పురస్కారాన్ని అందించనున్నట్లు పేర్కొంది. Also Read: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆరు భాషల్లో స్వామి చాట్‌బాట్ Civilian Award To PM Modi అలాగే భారత్, డొమినికాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేశారని ప్రశంసించింది. వచ్చేవారమే గయానాలో జరిగే ఇండియా-కరికోమ్ సదస్సులో ఈ అవార్డును అందించనున్నట్లు తెలిపింది. నవంబర్ 19 నుంచి 21 వరకు ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా డొమినికా ప్రధాన కార్యాలయం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. Also Read : నన్ను ఏం అడిగారంటే.. విచారణ తర్వాత చిరుమర్తి లింగయ్య సంచలన వ్యాఖ్యలు! ''2021 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ డిమినికాకు 70 వేల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపించింది. భారత్ అందించిన ఈ అపురూపమైన సహకారం వల్ల మేము మా పొరుగు దేశాలకు కూడా అండగా నిలిచాం. అలాగే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఆరోగ్యం, విద్య, ఐటీ రంగంలో భారత్ మాకు మద్దతుగా నిలుస్తోంది. భారత్ మాకు గొప్ప భాగస్వామి. ఇందుకోసమే ఆ దేశ ప్రధాని మోదీకి.. మా దేశ అత్యున్నత జాతీయ పురస్కారంతో గౌరవించాలని నిర్ణయించామని'' డొమినికా ప్రధాన కార్యాలయం తెలిపింది. Also Read: మోదీ కీలక నిర్ణయం.. స్థానిక భాషల్లో ఇకపై మెడిసిన్ ఇదిలాఉండగా 2020లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. కోట్లాదిమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ సైతం కుదేలైపోయింది. ఇక కరోనా సెకండ్ వేవ్ వల్ల భారత్‌లో చాలా మరణాలు సంభవించాయి. అయితే ఈ మహమ్మారి ఇంకా మన మధ్యే ఉన్నప్పటికీ ప్రస్తుతం దీని ప్రభావం చాలవరకు తగ్గిపోయింది. దీనికి సంబంధించిన వ్యాక్సిన్లు కూడా అందరికీ అందుబాటులకి వచ్చేశాయి. Also Read : తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు..హైకోర్ట్ కీలక నిర్ణయం, నటి కస్తూరి అరెస్ట్? #civilian-award #telugu-news #national-news #pm-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి