నడిరోడ్డుపై దారుణం.. తల్లీ కొడుకును నరికి చంపిన యువకుడు!

సంగారెడ్డి జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. పాత కక్షతో సరోజాదేవి, అనిల్‌ అనే తల్లీ కొడుకులను బీహార్‌కు చెందిన నాగరాజు బొంతపల్లిలో నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు.  పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

author-image
By srinivas
New Update
DRERR

Murder: సంగారెడ్డి జిల్లాలో పట్టపగలే ఘోరం జరిగింది. పాత కక్షలతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. నడీ రోడ్డుపై అందరూ చూస్తుండగానే తల్లీ కొడుకునే అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం  రేపుతుండగా.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కొడుకు చావుకు కారణమయ్యారనే.. 

బీహార్‌కు చెందిన నాగరాజు (30) దంపతుల రెండేండ్ల కొడుకు ఇటీవల అనుమానస్పదంగా మరణించాడు. దీంతో కొడుకు చావుకు సరోజాదేవి (50), అనిల్ (30) అనే తల్లీకొడుకులే కారణమని అనుమానంతో కొంతకాలంగా నాగరాజు కక్ష పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గురువారం బొంతపల్లీలో వారితో గొడపడి.. అదే ఆవేశంలో నడిరోడ్డుపై కత్తితో పొడిచి ఇద్దరిని చంపేశాడు. మృతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరి హత్యకు పాతగొడవలే కారణమని స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు